TDP

పీలేరులో రెండోరోజూ యువనేత నీరాజనాలు యువనేతను కలిసిన సీనియర్ నేత కంభంపాటి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పార్టీలో చేరికలు

పీలేరు: టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 36వ రోజు (సోమవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో కొనసాగింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా రెండోరోజుకూడా యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పీలేరు మండలం వేపులబయలు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పెదబయలులో బిసిలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. అయ్యవారిపల్లివద్ద మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. శివపురం వద్ద గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. శివపురం అంకాళమ్మ గుడివద్ద సగర సామాజికవర్గీయులు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తిమ్మిరెడ్డిగారిపల్లి,భోయపల్లిలో స్థానికులు యువనేతకకు ఘనస్వాగతం పలికారు. ఎల్లంపల్లి గ్రామప్రజలు యువనేతను పుష్పగుచ్చాలతో స్వాగతించారు. చింతలవారిపల్లి గ్రామప్రజలు పెద్దఎత్తున యువనేతకు హారతులుపట్టారు. కొర్లకుంటలో యువకులు కేరింతలు కొడుతూ యువనేతకు నీరాజనాలు పలికారు. సత్యాపురం, కొర్లకుంట గ్రామప్రజలు హారతులిచ్చారు. మండల కేంద్రం కలికిరిలో యువనేతకు స్థానిక ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు జనం ముఖ్యంగా యువతీయువకులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. మహిళలు, యువత, వృద్ధులను కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు.  నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారంతో బతుకు భారం గా మారిందని లోకేష్ ఎదుట మహిళలు వాపోయారు.  కలికిరి ఇందిరమ్మ నగర్ వాసులు యువనేతను హారతులిచ్చి స్వాగతించారు. నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో వైసిపి నాయకుడు, కలికిరి సర్పంచ్ ఆర్ ప్రతాప్ రెడ్డి, మహాల్ మాజీ సర్పంచ్ వై. సతీష్ రెడ్డి, ఎనుగొండపాలెం మాజీ ఎంపిటిసి ఏ. శ్రీనివాసుల నాయుడులతో సహా 1500 కుటుంబాలు యువనేత సమక్షంలో టిడిపిలో చేరాయి. యువనేత వారిని పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు: ఖాదర్ ఖాన్, ఎర్రకోటపల్లి, కలగడ మండలం:ఎంఎస్సీ ఎన్విరాన్ మెంట్ సైన్స్ చదివాను. నా తమ్ముడు హసన్ ఆలీ బి.ఇడి పూర్తిచేశాడు. మా ఇద్దరికీ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నాం. మేం నలుగురు సంతానం. మాతండ్రి కేవలం రెండెకరాల చిన్న రైతు. వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చిన్నచిన్న పనులు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాం. మాకు ఉద్యోగాలు వచ్చి కష్టాలు తీరాలంటే చంద్రబాబు లాంటి విజనరీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.

ఓడ యల్లయ్య, పుట్టపాలెం:

నాకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి మూడు విడతలుగా 1.8లక్షలు ఇచ్చింది. అయితే నేను ఇల్లు కట్టుకోవడానికి రూ.7లక్షలైంది. బయట 5లక్షలు అప్పుచేసి అతికష్టమ్మీద ఇల్లు కట్టుకున్నాను. ఇంటికి కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి మూడు పోల్స్ వేయాల్సి ఉంది. రూ.75వేల ఇస్తే పోల్స్ వేసి కనెక్షన్ ఇస్తామని అంటున్నారు. దీంతో నేను పక్కింటి వాళ్లను బతిమాలి కరెంటు తీసుకుంటున్నా. ఇప్పటికే రూ.5లక్షల అప్పుల పాలైన నేను మరో రూ.75వేలు ఎక్కడినుంచి తేవాలి?

బినామీలు, ఊరుపేరులేని కంపెనీలతో లక్షలకోట్ల ఒప్పందాలా? కాగితాల్లేవు… అగ్రామెంట్లు లేవు…అందుకే అది లోకల్ ఫేక్ సమ్మిట్!

దేశం మొత్తానికి సరిపడా విద్యుత్ ఇక్కడే తయారుచేస్తారా? తప్పుడు కంపెనీల బాగోతం బట్టబయలుచేసిన యువనేత లోకేష్

పీలేరు: ఏ ప్రభుత్వం అయినా ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తారు, కానీ వైసిపి ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన సమ్మిట్ కు సంబంధించి ఒప్పందాల పుస్తకాలు, సంతకాలు చూపించడం లేదు… అందుకే అది లోకల్ ఫేక్ సమ్మిట్ అంటున్నానని TDP యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. వేపులబయలు క్యాంప్ సైట్ లో యువనేత లోకేష్ సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ… కాగితాలు లేని ఎంఓయూ లు మార్చుకున్నారు. 378 ఎంఓయూలు జరిగితే 70కంపెనీల పేర్లు మాత్రమే బయటపెట్టారు. చంద్రబాబు పాలనలో ఆన్ లైన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు దానిలో చూపించేవాళ్లం.

అసలైన వికేంద్రీకరణ చేసి చూపించాం!

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది Nara Chandrababu Naidu. 2014-2019 మధ్య అన్ని జిల్లాల్లో అనేక పరిశ్రమలను చంద్రబాబు నెలకొల్పారు.ఏపీలో జిల్లాల వారీగా టీడీపీ ఏర్పాటు చేసిన పరిశ్రమలపై వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. దానిలో 2014-19 మధ్య 39,450 పరిశ్రమలు తెచ్చామని, వాటి ద్వారా  5,13,350ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

మేం తెచ్చిన కంపెనీలు ఇవిగో!

టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకీ పరిశ్రమలు తెచ్చాం. కడపకు వెల్ స్పన్ కంపెనీని తీసుకొచ్చాం. చిత్తూరుకు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. వీటిలో టీసీఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, ఫాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు ఉన్నాయి. కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ ఉత్పత్తి కేంద్రాలు తీసుకువచ్చాం. నెల్లూరు హీరోమోటార్స్, అపోలో టైర్స్, సుజల వంటి వందలాది పరిశ్రమలు తెచ్చాం. ప్రకాశంలో ఏషియన్ పేపర్ మిల్స్. గుంటూరు, కృష్ణాకు అశోక్ లైల్యాండ్,కేసీపీ, హెచ్.సీ.ఎల్, ఉభయగోదావరిలో అనేక ఫిషరీస్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తెచ్చాం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తో ఒప్పందం, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజియెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు తెచ్చాం. టీడీపీ హయాంలో 31శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో రాయలసీమకు, 23శాతం ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఇచ్చిన సమాధానమే. మేం చెబుతున్నది కాదు.

గంజాయిలో మొదటి స్థానం

ఏపీలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలు ఏపీలో విస్తరించడం లేదు. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో, కర్నాటకలో తమ వ్యాపారాన్ని విస్తరించింది. ఒక్కో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఇస్తోంది. అమర్ రాజా కంపెనీ కూడా తెలంగాణకు వెళ్లిపోయింది. దీనివల్ల ఏపీ యువత 20వేల ఉద్యోగాలు కోల్పోయారు. ఏపీ ఎఫ్ డీ ఐ లో 14వ స్థానంలో ఉంది. ఝార్ఖండ్ కంటే మనం వెనుకబడి ఉన్నాం. నిరుద్యోగ సమస్య మూడు రెట్లు పెరిగి 13.5శాతానికి పెరిగింది. గంజాయి సరఫరాలో మాత్రం ఏపీ మొదటి స్థానంలో ఉంది. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

మీరు అధికారంలోకి వస్తే డీకేటీ భూములను రెగ్యులర్ చేస్తారా?

సమాధానం: కర్నాటకలో అమలవుతున్న చట్టాన్ని అధ్యయనం చేసి, ఏపీలోనూ దాన్ని అమలు చేస్తాం.

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై భూ దోపిడీపై మీరు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని నారాయణస్వామి అంటున్నారు. మీరు సిద్ధమా?

సమాధానం: నేను సిద్ధం రమ్మని చెప్పండి.

బిసిలతో ముఖాముఖిలో వివిధ సామాజికవర్గ ప్రతినిధుల అభిప్రాయాలు:

విద్యాసాగర్, కురుబ: గొర్రెలుమేపడం మా కుల వృత్తి. గొర్రెలు రకరకాల జబ్బులు వచ్చి చనిపోతున్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇన్స్యూరెన్స్ రావడం లేదు. గొర్రెలు మేపడానికి స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీడుబీములకు ఫెన్సింగ్ వేయడం వల్ల మేపుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. అసైన్డ్ భూముల్లో గొర్రెలు మేపడానికి హక్కు ఇవ్వాలి. గొర్రెలు కొనడానికి ప్రభుత్వం రుణాలు అందించాలి. కార్పొరేషన్ రుణాలు కోసం ఎన్ని సార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదు. కురుబ కార్పొరేషన్ ద్వారా మాకు రుణాలు మంజూరు చేయాలి. ఈ ప్రభుత్వం కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు. గొర్రెల వెంట తిరిగితే కాళ్ల నొప్పులు..పథకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగీ కాళ్ల నొప్పులు వస్తున్నాయి. చింతల రామచంద్రారెడ్డి వల్ల మాకు మిగిలింది చింతలే.

కె.చంద్రమోహన్, నాయీ బ్రాహ్మణ: సెలూన్స్ వృత్తిని వేరే కులాల వారు పెట్టి మా పొట్ట కొడుతున్నారు. మా వృత్తి ఇతరులు చేస్తే వృత్తి అంతరించిపోతుంది. దేవాలయాల్లో క్షురకులు కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నారు. వారిని రెగ్యులరైజ్ చేయాలి. పదేళ్లకు పైగా కష్టపడి క్షురకులుగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రూ.10 వేలు చేయూత అని ఇప్పుడు ఓనర్ కి ఇస్తున్నారు. ఓనర్ ఒక్కరు ఉంటారు..కూలీలు నలుగురు ఉంటారు. కానీ వాళ్ల పరిస్థితి ఎలా? సెలూన్లు నిర్వహించుకునే మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ సహాయం అందడం లేదు.

నాగేంద్ర, బెస్త: చేపలు పట్టుకొని జీవించే మాకు ఇన్స్యూరెన్స్ కల్పించాలి. ఉండటానికి సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం.

శివ శంకర్, వడ్డెర: ఆర్థికంగా , రాజకీయంగా వెనుక బడి ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో మేము ఎస్టీల్లో ఉన్నాం. ఇక్కడ మాత్రం బీసీలుగా ఉన్నాం. మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలి. వడ్డెర కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి. మాపై జరిగే దాడులు అరికట్టాలి.

లోకేష్ ను కలిసిన ఉప్పర, సగర సామాజికవర్గీయులు

పీలేరు నియోజకవర్గం, వేపులబయలు శివారు అంకాళమ్మ దేవాలయం వద్ద సగర – ఉప్పర సామాజికవర్గీయులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.  సంచార జాతిగా ఉన్న సగరలను బిసి-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలి. నిర్మాణపనులు చేసుకునే మా కులవృత్తి నానాటికీ దెబ్బతింటోంది. కాంట్రాక్టు పనుల్లో 33.3 శాతం పనులు టెండర్లు లేకుండా నామినేటెడ్ గా కేటాయించాలి. పనుల నిర్వహణకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలి. సగరలు నిర్మాణరంగ కార్మికులైనందును హౌసింగ్ బోర్డు చైర్మన్ గా సగరలను నియమించాలి. అమరావతి రాజధానిలో కమ్యూనిటీహాల్ నిర్మించాలి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు అమరావతిలో ఎకరా స్థలం కేటాయించాలి. 50 ఏళ్లు నిండినవారికి పెన్షన్ మంజూరు చేయాలి. రాజకీయంగా వెనకబడిన సగరలకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి. మా ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉన్న ఉప్పర మీటింగ్, ఉప్పరసోది అనే వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం నిషేధిస్తూ జీవో ఇచ్చింది..దాన్ని కచ్చితంగా అమలుచేయాలని కోరారు.

నారా లోకేష్ మాట్లాడుతూ…

కులానికొక కార్పొరేషన్ పేరుతో ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. సగర – ఉప్పర కులస్తులకు ఈ సీఎం ఒక్క రుణమైనా ఇచ్చారా.? 50 నిండిన వారికి పెన్షన్ ఇచ్చే అంశం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాజకీయంగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారంలోకి రాగానే మీ ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. సగర-ఉప్పర కులస్తుల న్యాయమైన డిమాండ్లు అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

మళ్లీ కోడికత్తి కమల్ ను నమ్మొద్దు

2024 ఎన్నికల్లో మళ్లీ కోడికత్తి కమల్ హాసన్ కొత్త స్క్రిప్టుతో మీ ముందుకు వస్తాడు. ఎవరూ నమ్మొద్దు. మీ బాధలు పోవాలంటే, మహిళలకు నిత్యావసరాలు తగ్గాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, రైతుకు గిట్టుబాటు ధర రావాలంటే, కార్మికులకు చేతినిండా పనిదొరకాలంటే బాబు రావాలి…సైకో పోవాలి.  పోలీసుల కష్టాలు పోవాలన్నా బాబు రావాల్సిందే. కిషోర్ కుమార్ రెడ్డి మీకు అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీరంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో పీలేరులో టీడీపీ దుమ్ముదులపండి. కిషోర్ అన్నను అసెంబ్లీకి పంపండి. మీకు కావాల్సిన పనుల గురించి నాకు వదిలేయండి. పీలేరు ప్రజలంతా ఏకమై టీడీపీ విజయానికి ముందుకు రావాలని కోరుతున్నా.

పీలేరు ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వైసీపీకి సేవ చేసినా వైసీపీ నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చాలా అవమానించారు. వీళ్ల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారు. వీళ్ల ఆత్మగౌరవానికి మన పార్టీ పెద్దపీఠ వేస్తుందనే నమ్మకంతో మన పార్టీలో చేరుతున్నారు. చాలా సంతోషం. వీళ్ల చేరికతో మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ఆనందదాయకం. వైసీపీ నాయకులకే ఈ నియోజకవర్గంలో భద్రత, గౌరవం లేదు. పీలేరు నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలో బ్రతుకుతున్నారు. వీళ్లందరికీ మేము అండగా ఉంటాం… మన పార్టీని గెలిపించుకుంటాం…

Also read this blog: Affable Welcome of Youth Leaders by the Local Community in Punganuru

 #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *