TDP

పుంగనూరులో రెండోజూ యువనేతకు నీరాజనాలు

పుంగనూరు:  యువనేత Nara Lokesh యువగళం పాదయాత్ర 34వరోజు (శనివారం) పుంగనూరు నియోజకర్గం పులిచర్ల మండలంలో  అడుగడుగునా ప్రజల నీరాజనాల నడుమ ముందుకు సాగింది. కొక్కువారి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కొక్కువారిపల్లిలో గ్రామస్తులు, పార్టీనేతలు భారీ గజమాలతో యువనేతకు స్వాగతం పలికారు. ఆ గ్రామానికి చెందిన మత్స్సకారులు యువనేతకు వల, బుట్ట బహుకరించారు. మిల్లుమీద రాచపల్లి గ్రామం వద్ద యువనేతకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. చిన్ననగిరి గ్రామంలో మహిళలకు యువనేత హారతులు పట్టారు. దేవళం పేట గ్రామంలో లోకేష్ ను తమ గ్రామంలోకి ఆహ్వానిస్తూ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. తుడుంవారిపల్లిలో బిసి నాయకులు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. కల్లూరు శివార్లలో భోజన విరామ సమయంలో యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసిపి నేతల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న మిస్బా తల్లిదండ్రులు యువనేతను కలుసుకున్నారు.. కల్లూరులో నారా లోకేష్ కి టిడిపి కార్యకర్తలు, నాయకులు. పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. లోకేష్ ని చూడటానికి ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  మరికాసేపట్లో కల్లూరులో లోకేష్ పర్యటన మొదలవుతుందనగా కల్లూరులో  మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు దగ్గరుండి దుకాణాలు మూయించారు. చెరుకువారిపల్లి, దిన్నె బెస్తవారిపల్లి, అయ్యవాండ్లపల్లి మీదుగా జ్యోతినగర్ విడిది కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది.

పిఎల్ ఆర్ వాహనం వద్ద యువనేత సెల్ఫీ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ ఆర్ కంపెనీకి చెందిన టిప్పర్ ఎదుట యువనేత లోకేష్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే కదా నిన్ను పాపాల పెద్దిరెడ్డి అని ప్రజలు అనేది. పుంగనూరు నియోజకవర్గంలో రోడ్డుపై చిన్న గుంత పూడ్చాలన్నా, రోడ్డు వేయాలన్నా పెద్దిరెడ్డి సొంత సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్సే చేయాలంట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నియంత పెద్దిరెడ్డికి చెందిన ఈ లారీ అని వ్యాఖ్యానించారు.

జాబితాలో పేరున్నా ఇల్లు ఇవ్వలేదు! షేక్ మల్లికా బాను (కల్లూరు గ్రామం)

ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇచ్చే సమయంలో దరఖాస్తు చేసుకోగా, అర్హుల జాబితాలో కూడా నాపేరు ఉంది. టిడిపికి చెందిన దాన్ననే కారణంపై నాకు ఇల్లు మంజూరు ఇవ్వలేదు. పెన్షన్ కూడా నిలిపివేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇల్లు ఇచ్చి, పెన్షన్ మంజూరు చేయండి.

అధికారంలోకి వచ్చాక కెజి టు పిజి ఉచిత బస్ పాస్! పోటీపరీక్షలను ఎదుర్కొనేలా సిలబస్ లో మార్పులు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం చిత్తూరులో స్పోర్ట్స్ అకాడమీ నిర్మించి క్రీడలను ప్రోత్సహిస్తాం యువతీయువకులతో ముఖాముఖిలో యవనేత లోకేష్

పుంగనూరు: TDP అధికారంలోకి వచ్చిన వెంటనే కెజి టు పీజీ విద్యార్థుల‌కు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో యువతీయువకులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చాక పోటీపరీక్షలను ఎదుర్కొనే విధంగా సిలబస్ ను మార్పుచేస్తాం. ప్రైవేటు, ప్రభుత్వ, స్వయం ఉపాధి రంగాల్లో యువతకు మేం అధికారంలోకి వచ్చాక మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. చిత్తూరుకు స్పోర్ట్స్ యూనివర్శిటీ తీసుకొస్తాం. క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. ఉమ్మడి ఏపీలో పుల్లెల గోపీచంద్ కు భూమి కేటాయించి అకాడమీ పెట్టిస్తే మన దేశానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయి.  ఏపీని ఐటీ హబ్ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మీ కోరిక మేరకు కల్లూరుకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీని తీసుకొస్తాం.

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తాం

Nara Chandrababu Naidu వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించారు. రైతులకు విత్తనాలు నుండి పంట రవాణా చేసే వరకు అయ్యే ఖర్చులను తగ్గించాలని చంద్రబాబు నిర్ణయించారు. గతంలో భూసార పరీక్షలు చేశాం. ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. అన్ని విధాలా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం. జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశాడు. గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,500కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని మాట తప్పాడు. మేం అధికారంలోకి వచ్చాక పెట్టుబడి ఖర్చు తగ్గిస్తాం. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆదుకుంటాం. జగన్ రెడ్డి రైతులకు మోటార్లకు మీటర్లతో ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడు. వాటిని తిరస్కరించండి.

40శాతం పదవులు యువతకే!

టీడీపీలో 40శాతం యువతకు పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉత్సాహవంతులైన యువతకు జాతీయ స్థాయి వరకు అవకాశాలు ఉన్నాయి.  మంగళగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నేను శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా. మొదటి ప్రయత్నంలో నేను ఓడినా అలసిపోకుండా నేటికీ పోరాడుతున్నా. మా కుటుంబ సభ్యులు చనిపోయినా సరే నా పాదయాత్రను నేను కొనసాగిస్తున్నా. మీరు నాతో అడుగులు కలపండి.

టిడిపి వచ్చాక పెట్టుబడుల వరద

టిడిపి అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో మన రాష్ట్రం వాళ్లే అధికంగా ఉన్నారంటే చంద్రబాబు చలవే. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. టీడీపీ పాలనలో మనం చేసుకున్న ఒప్పందాల తర్వాత 2019లో మనం అధికారంలోకి వస్తే ఇప్పటికే 50లక్షల ఉద్యోగాలు వచ్చేవి. మనం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో పరిశ్రమలు, పెట్టుబడులు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తాయి.

యువత భవిష్యత్తున నాశనం చేసిన పెద్దిరెడ్డి

పుంగనూరు ఎమ్మెల్యే ఇక్కడి యువత భవిష్యత్తును నాశనం చేశారు. పెద్దిరెడ్డి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినా వైద్య సదుపాయాలు తీసుకురాలేకపోయాడు.  నియోజకవర్గ ప్రజలకు వైద్యాన్ని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అందుబాటులోకి తెస్తాం. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా దొరకని దుస్థితి వచ్చింది. పేదవాళ్లకు వైద్యం దక్కడం లేదు. చిత్తూరు జిల్లాకు మెడికల్ యూనివర్శిటీని తీసుకొస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుంగనూరుకు రూ.100కోట్లు కేటాయిస్తే పెద్దిరెడ్డి పనులు చేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఇక్కడ ఒక్క పనికూడా చేయలేదు. 13కిలోమీటర్లకు 32కల్వర్టులు నేను ఎక్కడా చూడలేదు. ప్రజా ధనాన్ని పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాడు.

ఒక్క పరిశ్రమ అయినా పుంగనూరుకు తెచ్చారా?

రాజంపేట ఎంపీగా ఒక వ్యక్తిని మీరు రెండుసార్లు గెలిపించారు. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా? పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిపించారు. మీకు ఉపయోగం లేదు. పాపాలు చేసే వారిని, మోసాలు చేసేవారిని గెలిపించి, ఉపయోగపడేవారిని పక్కనబెడితే మీకు పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈ పుంగనూరులో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ తప్ప, మరేదైనా డెయిరీ ఇక్కడ ఉందా? పల్ప్ కంపెనీ పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు పెట్టి రైతులను దోచుకుంటున్నాడు. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే టీడీపీ ని గెలిపించండి. మీకు నిజమైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్నంతకాలం మీ పుంగనూరుకు ఏమీ రావు.

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ ను పునరుద్దరిస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చాక పూర్వపు ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. పీజీ విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ జగన్ రెడ్డి రద్దు చేశాడు. పీజీలు చదవకుండా పేద విద్యార్థులపై వివక్ష చూపిస్తున్నాడు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో స్టార్టప్ కార్యక్రమాలను టీడీపీ నిర్వహించింది. తిరుపతిలోనూ దాన్ని అమలు చేశాం. స్టార్టప్ కు సంబంధించిన సలహాలు, సూచనలు, సహకారం అందించాం. మనం అధికారంలోకి వచ్చాక స్టార్టప్ విధానాన్ని ప్రోత్సహిస్తాం. మీరంతా ఒక్కొక్కరూ ఓ వెయ్యి మందికి ఉద్యోగాలిచ్చేలా చేస్తాం.

కేసులకు ఎవరూ భయపడొద్దు

పుంగనూరు టీడీపీ నాయకులపైనే రాష్ట్రంలో అధికంగా కేసులు ఉన్నాయి. కేసులు పెట్టింది పాపాల పెద్దిరెడ్డి. భారతదేశంలో అత్యధికంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీలు ఏపీలోనే బ‌నాయిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి, ప్రధానికి మనం ఫిర్యాదు చేద్దాం. మీరు పోరాడండి. మీకు నేను అండగా ఉంటా. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. టీడీపీ పాలనలో స్మగ్లర్లు, దొంగలు, దోపిడీదారులు, హంతకులు భయపడేవారు. జగన్ రెడ్డిని చూసి ఎవరూ భయపడడం లేదు.  అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ గంజాయి స్మగ్లర్. వాడు దళిత డ్రైవర్ ను చంపితే వైసీపీ వాళ్లు ఘనంగా సన్మానించారు.

దుష్టపాలన అంతానికే యువగళం

దుష్టపాలనను రాష్ట్రం నుండి తరిమేయాలనే ఉద్దేశంతో నేను యువగళం ప్రారంభించాను. ఫాక్స్ కాన్ అనే కంపెనీ మన రాష్ట్రం నుండి వెళ్లిపోయి తెలంగాణకు చేరింది. అక్కడ లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తోంది. తాజాగా కర్నాటక రాష్ట్రంతోనూ ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది. శ్రీ సిటీలో షావోమి సెల్ ఫోన్ కంపెనీని మనం స్థాపించాం. టీడీపీ తెచ్చిన కంపెనీలను జగన్ రెడ్డి నిలబెట్టి ఉంటే ఈ రెండేళ్లలో 2లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ తరిమేశాడు.

మళ్లీ జగన్ వస్తే యువతకు వలసలు తప్పవు

జగన్ రెడ్డికి మరోమారు అవకాశమిస్తే ఏపీ యువత కేరాఫ్ అడ్రస్ తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, చివరకు ఉత్తర ప్రదేశ్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? రాష్ట్రంతో జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఏ సంస్థకూ రాష్ట్రంపై నమ్మకం కుదరడం లేదు. యువత గ్రామ స్థాయి నుండి పోరాడండి. పని చేయండి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీ వంతు సహకారం అందించండి. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులన్నీ రద్దు చేస్తాం. పోరాడిన యువతకు పెద్దపీట‌ వేస్తాం.

విభజిత జిల్లాల ప్రాతిపదికన పరిశ్రమలు

కుప్పం, పలమనేరుకు పరిశ్రమలు వచ్చాయి. కానీ పుంగనూరుకు పరిశ్రమలు రాలేదంటే ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి నియోజకవర్గ ప్రజలపై ఎంత చిన్న చూపో ఆలోచించండి. యువత ఆలోచించాలి. మీకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఎమ్మెల్యే న్యాయం చేస్తాడో నిర్ణయించుకోవాలి. 2025 జనవరి నుండి ప్రతి యేటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం. బడుగు, బలహీన వర్గాలు, ఓసీ పేదలకు కూడా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అకాశాలు కల్పిస్తాం. ఏపీ నుండి పక్కరాష్ట్రానికి వలసలు వెళ్లడాన్ని అరికట్టి…పక్క రాష్ట్రం నుండి ఏపీకి వలసలు వచ్చేలా చేస్తాం. విభజన జిల్లాల ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.

యువతీయువకులతో ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

లోకేష్, విద్యార్థి: మాకు సరైన విద్య లేదు. చుట్టుపక్కల డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. దూరం వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలి. ఛార్జీలు పెరిగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. మాకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటుచేయండి.

కుమార్: నేను రైతును. ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తుంటే ఇదీ నష్టదాయకంగానే ఉంది. మమ్మల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోండి.

సునీల్: పెట్టుబ‌డులు, ఉద్యోగాలు వస్తాయి అని జగన్ రెడ్డి చెబుతున్నాడు. మాకు ఉద్యోగాలు రావడం లేదు. భవిష్యత్తులో అయినా మాకు ఉద్యోగాలు కల్పించే చర్యలు చేపట్టండి.

రవికిషోర్: నేను పీఈటీగా పనిచేస్తున్నాను. పిల్లల్లో క్రీడా స్ఫూర్తి లేదు, ఒత్తిడి త‌ట్టుకోలేక ఆత్మహ‌త్యలు చేసుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక విద్యా, క్రీడా రంగంలో మార్పులు తేవాలి.

వలీ: మెరుగైన వైద్యం కోసం మేము బెంగళూరు, చెన్నైకి పోవాల్సి వస్తోంది. పుంగనూరులో 100పడకల ఆసుపత్రి ఉన్నా సదుపాయాలు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక అయినా ఇక్కడ వైద్య సదుపాయాలు మెరుగుపర్చండి.

శివకుమార్: యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించే చర్యలు తీసుకోండి.

సునీల్: మీరు రూలింగ్ లోకి వచ్చాక ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పించండి. గంజాయి క‌ట్టడికి చర్యలు తీసుకొని యువత భవితను కాపాడండి.

శేఖర్, సదుం మండలం, చీకల చేను గ్రామం: మా గ్రామంలో యువతపై వైసీపీ వాళ్లు 307 కేసులు పెట్టారు. రాజకీయాల్లో మేం తిరుగుతుంటే పెద్దిరెడ్డి వర్గం మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ వేధిస్తున్నారు.

ప్రవీణ్ కుమార్, పాండిచ్చేరిలో  బీటెక్ ఫ‌స్టియ‌ర్‌: ఈ సీఎం స్కాలర్ షిప్ లు ఇవ్వడం లేదు, అస్తవ్యస్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ ప‌థ‌కాన్ని స‌రిదిద్దాలి.

పుంగనూరుకు శనిలా దాపురించిన పెద్దిరెడ్డి! టిడిపి వచ్చాక మైనారిటీల సంక్షేమానికి చర్యలు మైనారిటీలను వేధించే వారిపై జ్యుడీషియల్ విచారణ మైనారిటీలతో సమావేశంలో యువనేత నారా లోకేష్

పుంగనూరు: పుంగనూరుకు పాపాల పెద్దిరెడ్డి శనిలా దాపురించాడు. పేదవాళ్లు చదవకూడదు, తప్పులను నిలదీయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, అభివృద్దిలోకి రాకూడదనే దురుద్దేశంతో బెదిరింపు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం కల్లూరు ముస్లిం మైనారిటీతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ…  మూడుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు. టీడీపీ పాలనలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.100కోట్లు పుంగనూరు అభివృద్దికోసం ఇస్తే కనీసం వాటిని వినియోగించకుండా పనులకు అడ్డుపడ్డాడు. కేవలం తాను ఇచ్చిన పప్పు బెల్లాలు మాత్రమే తీసుకుని పేదవాడు పేదరికంలోనే మగ్గిపోవాలి అనే విధంగా పెద్దిరెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఖబరస్తాన్ ఆస్తుల దోపిడీలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల కబ్జాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తెస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న అవకాశాలను బట్టి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం.

జగన్ పాలనలో మైనారిటీలపై పెరిగిన వేధింపులు

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేశాడు. వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకోవడం తప్ప, రాష్ట్ర ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదు. మైనారిటీలను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కొంత మంది మైనారిటీలను దారుణంగా చంపేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక్క పుంగనూరులోనే 12మంది మైనారిటీలపై అక్రమ కేసులు పెట్టారు. మైనారిటీలను దారుణంగా చంపేస్తున్నా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కనీసం నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాడు.

టిడిపి వచ్చాక యథావిధిగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు

2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మైనారిటీల సంక్షేమాన్ని గతంలో అమలు చేసిన విధంగా యథావిధిగా కొనసాగిస్తాం. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరేయండి..మీకు నిజమైన అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేసి చూపిస్తాం. పుంగనూరు ప్రజలు ఉద్యోగాలు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తాం. బీడీ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక తోడ్పాటునందిస్తాం. భవన నిర్మాణరంగం కార్మికులకు గత పాలనలో అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం. జగన్ రెడ్డి దోచుకున్న కార్పొరేషన్ నిధులను వెనక్కి తీసుకొచ్చి, వాటిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం.

మైనారిటీల వేధించిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ

మైనారిటీలను అక్రమ కేసులతో ఇబ్బందిపెట్టే అధికారుల తోలు తీస్తాం..వాళ్లపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి వాళ్లను సర్వీస్ నుండి తొలగిస్తాం..అవసరమనుకుంటే జైలుకు కూడా పంపుతాం. అక్రమ కేసులు అన్నింటినీ కొట్టేస్తాం. వైసీపీ నాయకుల బెదిరింపులకు, అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. మీకు అండగా నేనుంటా. అవసరమైతే లాయర్లను మేం మీకు అందుబాటులో ఉంచుతాం. మీ హక్కుల కోసం మీరు పోరాడండి…మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నా. కార్యక్రమం ప్రారంభంలో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి లోకేష్ ను ఆశీర్వదించారు. మైనారిటీ మహిళ యువతనేతకు రక్షాబంధన్ కట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ…

రాష్ట్రంలోని మైనారిటీలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు చూసి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  గత నాలుగేళ్లలో ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ స్టంట్ లో భాగంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను పెట్టారు. జగన్ రెడ్డి మాయమాటలకు మైనారిటీలెవరూ మోసపోవద్దు.  టీడీపీని గెలిపించుకుని..మైనారిటీల సమస్యల్ని పరిష్కరించుకుందాం.

మైనారిటీలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

ఫిరోజ్: మా ప్రాంతంలో వైసీపీ వాళ్లు చేస్తున్న దోపిడీలు, అక్రమాలపై మేం ప్రశ్నించాం. ఏడుగురు మైనారిటీ యువకులపై మంత్రి పెద్దిరెడ్డి అక్రమ కేసులు పెట్టి, మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. జైల్లో 21రోజులు పెట్టారు. నేను కువైట్ లో ఉద్యోగం చేసేవాడిని. నా పాస్ పోర్టు కూడా రద్దు చేశారు. నన్ను ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.

అష్రఫ్ అలీ: మా పిల్లలు చదువుకునేందుకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి.

బావాజీ: జంగవారిపల్లి పంచాయతీలో షాదీఖానా నిర్మాణానికి గత నాలుగేళ్లుగా ప‌దిసార్లు కొబ్బరికాయలు కొట్టి ఆపేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు షాదీఖానా నిర్మించండి. మా పిల్లలకు చదువు నేర్పించే హజరత్ పక్క రాష్ట్రం నుండి వస్తారు. అతను ఉండడానికి ఓ ఇల్లు లేదు. సదుపాయాలు లేవు. వాటిని కూడా ఏర్పాటు చేయాలి.

ఖాసి: ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులులేవు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆదుకోండి.

అబుబకర్: బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి. ఏమైనా కంపెనీలు, ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించండి.

వలి: మదర్సాలకు ప్రభుత్వం వచ్చాక ఆర్థిక తోడ్పాటునందించండి.

వైసిపి నేత వేధింపుల కారణంగానే మిస్బా ఆత్మహత్య లోకేష్ ను కలిస్తే చంపేస్తామని బెదిరించారు యువనేత ఎదుట మిస్బా తల్లిదండ్రుల ఆవేదన

వైసిపి నేత  సునీల్ వేధింపుల కారణంగానే తమ కుమార్తె మిస్బా ఆత్మహత్య చేసుకుందని పీలేరులో ఆత్మహత్య చేసుకున్న మిస్బా తల్లిదండ్రులు యువనే లోకేష్ ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. అడుగడుగునా వైసిపి, నాయకులు, పోలీసుల బెదిరింపుల నడుమ అతికష్టమ్మీద భోజన విరామ సమయంలో యువనేత లోకేష్ ను మిస్బా తల్లిదండ్రులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మిస్బా బాగా చదువుకునేది, క్లాస్ ఫస్ట్ వచ్చేది. వైసిపి నాయకుడు సునీల్ కుమార్తె కి సెకెండ్ ర్యాంక్ వచ్చిందని ప్రిన్సిపల్ పై ఒత్తిడి చేసి మా కుమార్తె కు టిసి ఇచ్చి బయటకి పంపేశారని మిస్బా తల్లి నసీమా, తండ్రి వజీర్ అహ్మద్ ఆవేదన చెందారు. ఆ అవమానాన్ని భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆ రోజు నుండి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. కనీసం వైసిపి నాయకుడు సునీల్ ని అరెస్ట్ కూడా చెయ్యలేదు. మంత్రి పెద్దిరెడ్డి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది గడుస్తున్నా మాకు న్యాయం జరగలేదు. మా కుమార్తె కు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదు.

మిస్బాకు సంబంధించిన మార్కుల లిస్టులు, డ్రాయింగ్ పుస్తకాలు, వివిధ పోటీల్లో మిస్బా సాధించిన విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చి లోకేష్ కు చూపించారు. మైనారిటీ పిల్లలు బాగా చదవకూడదా? చదివితే వేధించి చంపేస్తారా? అంటూ తమ ఆవేదనను యువతనేతకు చెప్పుకుని బాధపడ్డారు. తమ కుమార్తె చనిపోయి ఏడాది గడిచినా ప్రభుత్వం తమను కనీసం ఓదార్చలేదని, ఎటువంటి సహాయ,సహకారాలు లేవని తెలిపారు.

మిస్బా పేరుతో కాంప్లెక్స్ కట్టి అందులో ఒక షాపు మాకు ఇస్తాం అని హామీ ఇచ్చారు. షాపు పెట్టుకోడానికి 5 లక్షలు సహాయం చేస్తామని నమ్మించారు.మిస్బా తమ్ముడు నిజాముద్ధిన్ ని  చదువు కు సహాయం చేస్తామని అన్నారు. సునీల్ ని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పలమనేరు లో ఉంటే చంపేస్తామని వైసిపి నేతలు బెదిరిస్తే పుంగనూరు వచ్చి బంధువుల ఇంట్లో తల దాచుకున్నాం. మంత్రి పెద్దిరెడ్డి ని అనేక సార్లు కలిసినా మాకు న్యాయం జరగలేదు. పైగా మిమ్ముల్ని కలిస్తే చంపేస్తాం, ఊర్లో ఉండనివ్వం అంటూ బెదిరించారు. లోకేష్ ని కలిస్తే ఇంట్లో సామాన్లు బయట పడేస్తాం ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిందే అంటూ బెదిరించారు. మాకు పెద్ది రెడ్డి నుండి ప్రాణహాని ఉంది. మమ్మల్ని కాపాడండి అంటూ లోకేష్ ను మిస్బా తల్లిదండ్రులు వేడుకున్నారు.

నారా లోకేష్ స్పందిస్తూ…

మిస్బా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని, తన కూతురికి పోటీ వస్తోందనే కక్షతో మిస్బాకి చదువును దూరం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నాయకుడు సునీల్ బలవంతంగా టీసీ ఇప్పించారు. మిస్బా తన డ్రాయింగ్ బుక్ లో నేను బాగా చదువుకోవాలి. డాక్టర్ కావాలని రాసుకుంది.(మిస్బా డ్రాయింగ్ బుక్ చూపిస్తూ). మిస్బా చేసిన తప్పేంటి? బాగా చదవడమే చేసిన తప్పా? వైసీపీ పాలనలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వాళ్లు చదువుకోకూడదనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మిస్బా తల్లిదండ్రులను మేం ఓదారిస్తే దాన్ని రాజకీయం చేసి, వేధిస్తున్నారు. ఇదేం సంస్కృతి? బాగా చదవేవారిని ప్రోత్సహించిన ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాం. గతంలో ఎప్పుడూ ఇన్ని దారుణాలు చూడలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న మిస్బా ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ కావాలని కలలు కన్న మిస్బా ని వైసిపి నేతలు అన్యాయంగా చంపేసారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటా. మీకు న్యాయం జరిగేలా నేను పోరాడతా. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిస్బా ఆత్మహత్యకు కారణం అయిన వారిని శిక్షిస్తాం.

Also read this blog: “Yuvagalam Continues to Achieve Greatness with Latest Endeavor”

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *