TDP

1).తిరుపతి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర! యువనేతకు అపూర్వస్వాగతం పలికిన తిరుపతివాసులు అడుగడుగునా మేళతాళాలు, బాణాసంచా మోతలతో నీరాజనం

తిరుపతి: అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుదీర్ఘంగా కొనసాగి 25వరోజు గురువారం సాయంత్రం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఉదయం పాదయాత్రకు బయలుదేరే ముందు టిడిపికి చెందిన కేంద్ర మాజీమంత్రి, బిసి నేత కింజరాపు యర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి యువనేత నివాళులర్పించచారు. తిరుపతి శివార్లలో యువనేతకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలనుంచి అపూర్వస్వాగతం లభించింది. అడుగడుగునా మేళతాళాలు, డప్పుల చప్పుళ్లు, బాణాసంచా మోతలతో యువతీయువకులు కేరింతలు కొడుతూ యువనేతకు నీరాజనాలు పలికారు. 25వరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం జీపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసులు యథావిధిగా యువనేత పాదయాత్రను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నీలిసానిపేటలో లోకేశ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ నిల్చున్న స్టూల్‍ను పోలీసులు లాక్కెళ్లారు. పోలీసుల తీరుపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పాదయాత్రను అడ్డుకోవాలని ఏ నిబంధనలు చెబుతున్నాయంటూ స్థానిక ఎస్ఐ ని నిలదీశారు. గాజులమాండ్యంలో టిడిపి ఫ్లెక్సీలు, తోరణాలు కొందరు రెవిన్యూ అధికారులు తొలగిస్తుండగా టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ సాకుతో బ్యానర్లను తొలగించడంపై పార్టీ కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము కేవలం యువగళం జెండాలు, ఫ్లెక్సీలను మాత్రమే పెడుతున్నామని, ఎక్కడా కనీసం పార్టీ జెండాలను కూడా ప్రదర్శించపోయినా తొలగించడం అక్రమమని కార్యకర్తలు పేర్కొన్నారు.పాదయాత్ర నల్లపాల్యం మీదుగా నీలిసానిపేటకు చేరుకున్న  సమయంలో లోకేష్ కు గ్రామస్తులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి, దిష్టితీస్తూ అభిమానం చాటుకున్నారు. వృద్ధులను, విద్యార్థులను  లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. గాజులమండ్యంలోనూ బాణసంచా పేల్చి కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పాదయాత్ర దారిలో ఎపి స్టూడెంట్స్ జెఎసి నాయకుడు హేమాద్రి యాదవ్ నేతృత్వంలో విద్యార్థులు లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు.  రేణిగుంటలో తాను ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా పనిచేసే సమయంలో తెచ్చిన జోహో సాఫ్ట్ వేర్ కంపెనీని లోకేష్ సందర్శించి అక్కడ ఉద్యోగులతో సెల్ఫీ దిగారు. లోకేష్ ను కలిసిన ఆనందంతో అక్కడి యువతీయువకుల ఆనందంతో పొంగిపోయారు. ఈ కంపెనీలో 100మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. రేణిగుంట వై.కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో లోకేష్ సమావేశమై వారి సాదకబాధలు తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో ప్రవేశించినపుడు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం లభించింది.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:

పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి -హేమాద్రియాదవ్, ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి

 టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ సంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చేది.  కానీ ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది. ఫీజ్ బకాయిలు ఉండటం వల్ల వేలాది మంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో నిలిచిపోయాయి. దీంతో ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా వెళ్లలేకపోతున్నారు. సీఎం అయ్యాక ఎయిడెడ్ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి విద్యార్థుల పొట్ట కొట్టారు. ఇవన్నీ మళ్లీ అమలు చేయాలని నారా లోకేష్ కు విన్నవించాము. యువగళం పాదయాత్రకు మా జేఏసీ తరపున సంఘీభావం తెలుపుతున్నాం.

ఎమ్మెల్యే పర్సంటేజ్ అడగడంతో బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి – చెన్నంపల్లి గ్రామస్తులు, ఏర్పేడు మండలం, శ్రీకాళహస్తి నియోజకవర్గం.

చెన్నంపల్లి గ్రామంలోకి వెళ్లాలంటే స్వర్ణముఖి ఏరు దాటుకుని వెళ్లాలి. బ్రిడ్డి నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులను టీడీపీ ప్రభుత్వం మంజూరం చేసింది. అంతలోనే ఆ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కాంట్రాక్టులో పర్సంటేజ్ ఇవ్వాలని అడిగారు. దీంతో కాంట్రాక్టర్ పనులు చేపట్టలేదు. వర్షం వచ్చి ఏరు పారిందంటే మా గ్రామంతో పాటు పెనుగడ్డం గ్రామస్తులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. చెన్నంపల్లి పంచాయతీ కింద ఉన్న నాలుగు గ్రామాలకు కూడా రాకపోకలు ఉండవు. మా సమస్యను లోకేష్ తో చెప్పుకున్నాం..ప్రభుత్వం రాగానే బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు.

2).కమ్యూనిటీ పారామెడిక్స్ సేవలను వినియోగించుకుంటాం! అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తాం ఆర్ఎంపిల సమావేశంలో యువనేత నారా లోకేష్

రేణిగుంట: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిటీ పారామెడిక్స్ ను అధికారికంగా గుర్తించి వారి సేవలను గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు వినియోగించుకుంటామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. రేణిగుంట వై.కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపి, పిఎంపిలతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆర్.ఎం.పీలు ఏవిధంగా సేవలందిస్తున్నారో నాకు తెలుసు. చంద్రబాబు గారు కూడా ఆర్.ఎం.పీ ల సమస్యలపై అవగాహన ఉంది.          గ్రామాల్లో ప్రాథమిక సేవలకు ఆర్ఎంపిలు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. మంగళగిరిలో ఎన్టీఆర్ సంజీవని అనే కార్యక్రమాన్ని నిర్వహించి పేదవారికి వైద్య సదుపాయం అందిస్తున్నాం. ప్రభుత్వం మాకు పోటీగా కార్యక్రమం పెట్టినా ప్రజలు వెళ్లడం లేదు..కారణం అక్కడ మందులు లేవు. జీఓ 429/2 రావాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది. డాక్టర్లను, మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు తెలుసుకుని మీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం. కోవిడ్ వచ్చినప్పుడు మా పార్టీలో పెద్దఎత్తున చర్చ జరిగింది. టెలీ మెడిసిన్ ద్వారా వైద్యం చేయొచ్చా అని ఆలోచించాం. లోకేశ్వర్ రావు అనే వైద్యుడు అమెరికాలో ఉంటూ టెలీ మెడిసిన్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో సేవలందించారు. ఎప్పటికప్పుడు రోగుల స్థితిగతులను తెలుసుకుని క్యాజువాలిటీలో రేటు జీరో, బ్లాక్ ఫంగస్ జీరో స్థాయికి మేం తీసుకొచ్చాం.

ఆర్ఎంపి నాయకులు మాట్లాడుతూ…

14మంది ఉన్నతస్థాయి కమిటీతో 221 వ్యాధులపై శిక్షణ ఇవ్వాలని జీఓ 429లో ఉంది. అందుకే దీన్ని కొనసాగిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 30వేల మంది ఆర్.ఎం.పీ లు ఉన్నాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు ఆర్.ఎం.పీలు ఉపయోగపడతాం. మా సేవలు ఉపయోగించుకోండి.

సమావేశంలో ఆర్ ఎంపిల అభిప్రాయాలు:

వెంకటరావు, కందుకూరు: నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ని, గ్రామీణ వైద్యుడిగా పని చేస్తున్నాను. ప్రభుత్వాలు మారుతున్నా మేం ఎన్ని వ్యాధులకు వైద్యం చేయొచ్చో ఎవరూ తేల్చడం లేదు.మాకు శిక్షణ ఇచ్చి, పరీక్షలు పెట్టకుండా నిలిపేస్తున్నారు.  మా వైద్య విధానానికి చట్టబద్దత కల్పించాలి. గ్రామీణ వైద్యుల పరిస్థితి రాన్రాను ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేసినా ఐఎంఏ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఏఎన్ఎం తదితరులు మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్.ఎం.పీ ల్లో 25శాతం మంది శిక్షణ పూర్తిచేసుకుని ఉన్నాం. అధికారంలోకి వచ్చాక మాకు అధికారిక గుర్తింపు ఇచ్చి ఆదుకోండి.

శ్రీనివాసులు, చిత్తూరు:  ఎంబీబీఎస్ డాక్టర్ల వద్ద 5-10 సంవత్సరాలు పనిచేసిన వాళ్లు ఆర్.ఎం.పీలుగా ఉన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో ఆర్.ఎం.పీలను భాగస్తులుగా చేయండి.

రాజు, కొండేపి: ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి మమ్మల్ని టీడీపీ ఆదుకుంటూనే వస్తోంది. నేడు వలంటీర్లే మమ్మల్ని వేధించే పరిస్థితి వచ్చింది. మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. జీఓ 429 తెచ్చి మా సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. మాకు 60సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ల సదుపాయాన్ని కూడా కల్పించాలని కోరుతున్నాం.

3).యాదవులకు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం! -నామినేటెడ్ పోస్టుల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం – యాదవులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

రేణిగుంట: టిడిపి అధికారంలోకి వచ్చాక యాదవులకు జనాభా దామాషా ప్రకారం వారికి న్యాయం రావాల్సిన నిధులు కేటాయిస్తామని, నామినేటెడ్ పోస్టుల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. రేణిగుంట వై.కన్వెన్షన హాలులో యాదవులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… పాలిచ్చే ఆవుని వద్దనుకొని… ప్రజలు తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. పాలనలో కార్పొరేషన్ ఛైర్మెన్లు, డమ్మీలు. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. టిడిపి హయాంలో రూ.278 కోట్లు కేవలం యాదవ సామాజిక వర్గం వారి సంక్షేమం కోసం ఖర్చు చేసాం. వైసిపి పాలనలో యాదవుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది సున్నా. పెన్షన్లు, అమ్మ ఒడి కూడా యాదవుల ఖాతా లో రాస్తున్నారు. ఇండస్ట్రియల్ క్లస్టర్ లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. ఆదరణ పథకాన్ని నాశనం చేశారు. వెయ్యి కోట్ల రూపాయలతో టిడిపి ప్రభుత్వం కొన్న పనిముట్లు కూడా వైసిపి ప్రభుత్వం పంచలేదు.

యాదవులను అన్నివిధాలా ఆదుకుంటాం!

యాదవుల్లో పేదరికం ఉంది. మిమ్మల్ని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విధాలా ఆదుకుంటాం. యాదవులను పారిశ్రామికవేత్తలగా తీర్చిదిద్దుతాం. గొర్రెలు, మేకల కొనుగోలు కు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సహాయం అందిస్తాం. గొర్రెల కాపరులు చనిపోతే ఇన్స్యూరెన్స్ అందిస్తాం. యాదవ భవనాల నిర్మాణం కోసం సహాయం చేస్తాం. నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి యాదవ సామాజికవర్గం యువకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం.

ఉన్నత విద్యావకాశాలు కల్పించండి -కె.గుణశేఖర్ యాదవ్

యాదవ కులంలో మూఢ నమ్మకాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి విద్య చాలా అవసరం. 10, ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు ఉన్నత చదవులు అందించాలి. పీజీ, డిగ్రీ చదవిన వారికి సరైన శిక్షణలేక ఇంట్లోనే నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఆర్థికంగా యాదవులు వెనకబడి ఉన్నారు. వ్యాపారాలు చేసుకోవాలంటే ఆర్థికంగా రుణాలు ఇస్తే బలపడతారు. రాజకీయంగానూ యాదవులు టీడీపీని అంటిపెట్టకున్నారు. కార్పొరేషన్లు వెనకబడిన వారి కోసం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభుత్వం నిరక్ష్యరాస్యులను చైర్మన్లుగా చేసింది..వారికి సరైన అవగాహన లేదు.

గోశాలల్లో ఉద్యోగాలు కల్పించాలి -గురుచరణ్ యాదవ్

రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో యాదవులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలో అన్ని  నియోజకవర్గాల్లో యాదవ భవనాలు నిర్మించి, ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలి. మా వృత్తి గొర్లు..వాటికి ఏదైనా రోగం వచ్చి చనిపోతే పరిహారం ఇవ్వాలి. గొర్రెల కాపరులు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి.

పెన్షన్ ఇప్పించేలా కృషిచేయండి -సంతోష్ యాదవ్

మా కులంలో కూడా 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇచ్చే ఆలోచన చేయాలి. చంద్రబాబు పెట్టిన స్కిల్ డెవలెప్మెంట్లో శిక్షణ తీసుకున్న నా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. యాదవులంతా టీడీపీనే నమ్ముతున్నారు. జనాభా దామాషా ప్రకారం మాకు కూడా రాజకీయ అవకాశం కల్పించడం టీడీపీకే సాధ్యం.

ఈ ప్రభుత్వం యాదవులను హత్యలు చేస్తోంది -సుబ్బూ యాదవ్

మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం యాదవులపై దాడులు చేస్తూ..హత్యలు చేయిస్తోంది. యాదవులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం వైసీపీ నేతలు యాదవులపై దాడులు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు.? రాజధానిలో యాదవ భవనానికి స్థలం కేటాయించాలి కేటాయించాలి.

Also Read:Yuvagalam Padayatra: A Walk of Perseverance despite of obstacles and hurdles at Every Step

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *