TDP

Yuagalam Padayatra

యువనేత రాకకోసం రోడ్లపై బారులు తీరిన జనం పీలేరు నియోజకవర్గంలో 3వరోజు అనూహ్య స్పందన యువనేతను కలవనీయకుండా కళాశాలకు గేట్లకు తాళాలు టిడిపిలో చేరిన నేతలపై తప్పుడు కేసులు… వేధింపులు

పీలేరు: యువనేత Nara Lokesh  చేపట్టిన యువగళం పాదయాత్ర 37వరోజు (మంగళవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ప్రారంభమైంది. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం 8గంటలకే విడిది కేంద్రం వద్ద అభిమానులు క్యూకట్టారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు, అభిమానులు ఆనందం వ్యక్తంచేశారు. ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి మంగళవారం నాడు పాదయాత్రకు బయలుదేరేముందు ముస్లింలతో యువనేత సమావేశమై వారి సాదకబాధలు విన్నారు. దారిపొడవునా జనం యువనేతకు నీరాజనాలు పలికారు. విజయవాడకు చెందిన పార్టీ నేత వంగవీటి రాధ యువనేతను కలిసి సంఘీభావంగా కొంతసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. భోజన విరామానంతరం యువనేత పాదయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. గంధబోయినపల్లి, బీదవారిపల్లిలో జనం యువనేతను చూసేందుకు బారులు తీరారు. యువనేత గ్రామాల్లో ప్రవేశించగానే యువతీయువకులు కేరింతలు కొడుతూ బాణాసంచా కాలుస్తూ నినాదాలు చేశారు. చింతపర్తిలో యువనేతకు ఘనస్వాగతం లభించింది. దారిపొడవునా పూలవర్షం కురిపించారు.

యువనేతను కలవకుండా అడుగడుగునా అడ్డంకులు!

యువనేత లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ వెన్నులో వణుకుపుడుతోంది. పాదయాత్ర పొడవునా వందలాదిమంది పోలీసులను మొహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించడమేగాక సరికొత్త కుట్రలకు తెరలేపారు. సోమవారంనాడు కలికిరిలో యువనేతకు భారీఎత్తున స్వాగతం పలికి టిడిపిలో చేరిన సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. నిన్న కలికిరిలో పర్యటన సందర్భంగా బాణాసంచా కాల్చారంటూ పీలేరు ఇన్ చార్జి కిషోర్ కుమార్ రెడ్డి, కలికిరి సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. పాదయాత్ర సందర్భంగా పెద్దఎత్తున విద్యార్థులు, యువకులు యువనేతను కలస్తుండటంతో అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నాటి పాదయాత్ర దారిలో విద్యార్థులు యువనేతను కలవకుండా కట్టడి చేసేందుకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజి, జెఎన్ టియు ఇంజనీరింగ్ కాలేజి, ఉమెన్స్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాళ్లకు పోలీసులు నోటీసులు జారీచేశారు. పాదయాత్ర సమయంలో విద్యార్థులను బయటకు వదిలితే క్రిమినల్ కేసులు పెడతామని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలిటెక్నిక్ కాలేజి వద్ద 100మంది పిల్లలు లోకేష్ ను కలిసేందుకకు బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న  ప్రిన్సిపాల్ హడావిడిగా వచ్చిన పిల్లలను లోపలకు తీసుకెళ్లి తాళాలు వేశారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

బయటకు చెప్పుకోలేం… మా సమస్యలు పరిష్కరించండి -భోజన విరామ సమయంలో లోకేష్ ను కలిసిన కానిస్టేబుల్కా నిస్టేబుల్ (కలికిరి): వాండ్లపల్లిలో భోజన విరామ సమయంలో యువనేతను ఓ కానిస్టేబుల్ కలిసి తమ బాధలను విన్నవించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక 20నెలలుగా టిఎ, డిఎలు లేవు. మూడు సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం ప్రభుత్వం నుంచి 1.70లక్షల వరకు రావాల్సి ఉంది. ప్రైవేటుగా 4రూపాయల అప్పుతెచ్చి పిల్లలను చదివించుకుంటున్నాను. వైసిపి ప్రభుత్వం వచ్చాక కానిస్టేబుల్ పోస్టులు భర్తీచేయకపోవడంతో పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. లోన్ కు దరఖాస్తు చేస్తే నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. మా సమస్యలు బయటకు చెబితే ఉద్యోగంలో ఉండనివ్వరు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

టిడిపి ప్రభుత్వంలో పనిచేశానని ఉద్యోగం నుంచి తీసేశారు! సహదేవ, గ్యారంపల్లి, కెవిపల్లి మండలం: నేను టిడిపి ప్రభుత్వ హయాంలో సంఘమిత్రగా పనిచేశాను. వైసిపి ప్రభుత్వం వచ్చాక నన్ను నిష్కారణంగా తొలగించారు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ బి.టెక్ చదువుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నాకున్న ఎకరం పొలంలో టమోటా పంట వేశాను. ధరల్లేక లక్షరూపాయల నష్టం వచ్చింది. మా కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ కూడా అందడం లేదు.

2).

వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలిస్తాం! దూదేకులకు ఆన్ లైన్ లో బిసి సర్టిఫికెట్లు ఇస్తాం గల్ఫ్ వెళ్లేవారికోసం కేరళతరహాలో బోర్డు ముస్లింలతో ముఖాముఖిలో యువనేత లోకేష్పీ లేరు: టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రకటించారు. పీలేరు నియోజకవర్గం కలికిరి పంచాయతీ ఇందిరా నగర్ సమీపంలోని యువగళం క్యాంపు సైట్ లో మైనారిటీలతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… ఇకపై వక్ఫ్ ఆస్తుల వైపు ఎవరూ చూడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా చేరుస్తామని చెప్పారు. ముస్లీం రిజర్వేషన్లు కోసం వైసిపి పోరాడటం లేదు. ప్రతిపక్షం లో ఉన్నా ముస్లీం రిజర్వేషన్లు కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతుంది టిడిపి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే దూదేకుల కులం వారికి బీసీ సర్టిఫికేట్ అందేలా చేస్తాం.

ఇండస్ట్రియల్ క్లస్టర్లలో భూములు కేటాయిస్తాం!

ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ముస్లీం లకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తాం. పీలేరు లో ఉన్న ఏపిఐఐసి భూముల్లో పరిశ్రమలు తీసుకొచ్చి మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ముస్లీం లను పారిశ్రామికవేత్తలు గా తీర్చిదిద్దుతాం. పీలేరు లో ముస్లీంలకి ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం షాపులు కేటాయిస్తాం. ఈద్గా అభివృద్ది చేస్తాం. ఖబర్ స్తాన్ వద్ద మౌలిక వసతులు కల్పించి అభివృద్ది చేస్తాం. పీలేరు నుండి ఎంతో మంది గల్ఫ్ వెళ్లి ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్ బాధితులకు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సహాయం అందిస్తుంది. అక్కడ ఏ సమస్య వచ్చినా ఆదుకునేలా కేరళ తరహాలో ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ బాధితుల కోసం గత టిడిపి ప్రభుత్వ హయాంలో సమర్థవంతంగా పనిచేసిన ఎపిఎన్ఆర్ టిని పునరుద్దరించి వారి సమస్యలు పరిష్కరిస్తాం. అధికారంలోకి లేకపోయిన టిడిపి ఎన్ఆర్ఐ విభాగం గల్ఫ్ బాధితులకు అండగా నిలిచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మొట్టమొదటి కార్పొరేషన్ పెట్టింది ఎన్టీఆర్

మైనారిటీల సంక్షేమం కోసం భారతదేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ను పెట్టిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ది. దాన్ని కొనసాగిస్తూ మైనారిటీలను పేదరికం నుండి దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.  మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి ఆర్థిక తోడ్పాటు నందించాం. ముస్లీంలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేసింది టిడిపి. ముస్లింలకు మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు కేటాయించింది టిడిపి. షాదిఖానా లు ఏర్పాటు చేసింది టిడిపి. ఖబర్ స్తాన్ లు అభివృద్ది చేసి మౌలిక వసతులు కల్పించింది టిడిపి. ఇమామ్ లు, మౌజామ్లకు గౌరవ వేతనం ఇచ్చింది టిడిపి. ఉర్దూ యునివర్సిటీ ఏర్పాటు చేసింది టిడిపి. హజ్ హౌస్ లు నిర్మాణం చేసింది టిడిపి. హజ్ యాత్ర కు ప్రభుత్వం నుండి సహాయం అందించింది టిడిపి. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు.

ముస్లింలను మోసగించిన జగన్

జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మోసం చేసారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా గారు ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదు. జగన్ రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేశారు. మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఖబర్ స్తాన్ ల అభివృద్ది కి, మౌలిక వసతుల కల్పన కు నిధులు కేటాయించడం లేదు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు.

జగన్ పాలనలో ముస్లింలపై పెరిగిన దాడులు

జగన్ పాలనలో మైనార్టీల పై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అబ్దుల్ సలాం ని వేధించి కుటుంబం తో కలిసి ఆత్మహత్య చేసుకునే లా చేశారు. మసీదు ఆస్తులు కాపాడుకోవడానికి పోరాడిన ఇబ్రహీం ని నడి రోడ్డు మీద చంపేశారు. హజీరా అనే ముస్లిం యువతిని అత్యాచారం చేసి చంపేశారు. ఏళ్ళు గడుస్తున్నా ఆమె కుటుంబానికి న్యాయం జరగలేదు. పలమనేరు కి చెందిన మిస్బా అనే అమ్మాయి స్కూల్ ఫస్ట్ వస్తుంది వైసిపి నేత వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. డాక్టర్ అవ్వాలని కోరుకున్న మిస్బా ని వైసిపి నేతలు అన్యాయంగా చంపేశారు. ఇన్ని ఘటనలు జరిగితే మైనార్టీ కమిషన్ చైర్మన్ ఈక్బాల్ అహ్మద్ ఖాన్ ఏమి చేశారు? ఒక్క ఘటన పైన కూడా స్పందించలేదు.

మైనారిటీలపై జగన్ అణిచివేత చర్యలు

మైనారిటీలకు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశాడు. 36మందిపై అక్రమ కేసులు బనాయించారు. పుంగనూరులోనే 12మంది మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పీలేరు జైలుకు పంపారు. శానసమండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ పట్ల వైసీపీ మంత్రులు అనుచితంగా ప్రవర్తించారు. దాడి చేశారు. బూతులు తిట్టి అవమానించారు. గత ప్రభుత్వంలో మేం బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా మైనారిటీలపై ఒక్క దాడి జరగలేదు.

దూదేకుల కులానికి చెందిన వారికి బీసీ సిర్టిఫికట్ ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది.

కేసులకు ఎవరూ భయపడొద్దు

యువగళంలో టపాసులు కాల్చినందుకు కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇలా ఏదో ఒక కేసు పెట్టి మిమ్మల్ని భయపెట్టాలని వైసీపీ నాయకులు చూస్తారు. ఎవరూ భయపడొద్దు. పీలేరులో తెలుగుదేశం జెండా ఎగరేయండి…మీ సమస్యల్ని మేం పరిష్కరిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లపై TDP చిత్తశుద్ధితోనే ఉంది. పార్లమెంటులోనూ టీడీపీ తన గళాన్ని విప్పుతోంది. టిడిపి తరపున లాయర్లను పెట్టి పోరాడుతోంది. జగన్ రెడ్డి కనీసం నోరు మెదపడం లేదు.

మైనారిటీల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రఫీ: మాకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ఇస్లామిక్ బ్యాంక్ విషయంలో ప్రభుత్వం నోరు మెదపడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

కరీముల్లా: దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మైనారిటీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్లు విద్యకు దూరమవుతున్నారు. వక్ఫబోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇచ్చి మా ఆస్తులను కాపాడండి.

సాధిక్: మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచాలి. హజ్ హౌస్ లను నిర్మించాలి.

అఫిద్ : గ్రామస్థాయిలో ఉన్న మైనారిటీ యువకులకు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదుకోండి.

ఎస్ కె జిలానీ: పీజీలు చదివి ఖాళీగా ఉన్నాం. డీఎస్సీ భర్తీలు లేవు. స్వయం ఉపాధికోసం బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు బ్యాంకులోన్లు షరతులు లేకుండా ఇప్పించండి.

హసీనా: గల్ఫ్ లో ఉన్న మైనారిటీ బాధితులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితుల రక్షణకు చర్యలు తీసుకోండి.

నజీర్: ఏపీలో స్టార్టర్ప్ లోన్లు ఇవ్వడం లేదు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు స్టార్టప్ లోన్లు ఇప్పించండి.

3).

మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాడు బిగిస్తున్న జగన్ఎ వరూ అంగీకరించొద్దు…. మీ తరపున మేం పోరాడతాం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం టమోటా మార్కెట్లలో జాక్ పాట్ విధానాన్ని రద్దుచేస్తాం రైతులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

పీలేరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు బిగించాలని చూస్తున్నాడు. ఒక్కసారి మీటరు బిగిస్తే తొలగించడం అసాధ్యం… మీటర్లు పెట్టేందుకు రైతులెవరూ అంగీకరించొద్దు… సర్వీస్ కట్ చేస్తే మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలం వాండ్లపల్లిలో రైతులతో యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… .ఉచిత విద్యుత్ మీ హక్కు. ఇది ఒక్క రైతు సమస్యకాదు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదాం. మీటర్ల విషయంలో వైసీపీకి చెందిన రైతులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తారు. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు కాబోతున్నాయి. రాయలసీమలో నీరు అందక ఎంతో లోతు బోరు తవ్వాల్సి ఉంటుంది. రైతుకు ఒక బోరు మాత్రమే ఉండాలని జగన్ అంటాడు.

పెట్టుబడులు తగ్గించి లాభసాటిగా మారుస్తాం!

టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేదు. రోజుకో విధంగా టమోటా ధర మారుతోంది.  టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ హామీ నెరవేర్చలేదు. టమోటాలు పోయాల్సింది రోడ్ల మీద కాదు..తాడేపల్లి కొంప ముందు. డ్రిప్ ఇరిగేషన్ కు చంద్రబాబు 90 శాతం సబ్సిడీ ఇస్తే ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గితేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరల తగ్గించడానికి చర్యలు తీసుకుని పెట్టుబడులు తగ్గించేలా చేస్తాం.

జగన్ వచ్చాక అన్నీ హాలిడేలే!

ఇప్పుడున్న వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఒక కోర్టు దొంగ. మంత్రయ్యాక రైతులను పట్టించుకున్నాడా? జగన్ వచ్చాక పవర్, క్రాప్, ఆక్వా హాలిడే వచ్చింది. ఉపాధిహామీపై కేంద్రంతో మాట్లాడి వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. రైతులకు పార్టీలుండవు. రాయలసీమకు టీడీపీ హయాంలో రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఇరిగేషన్ కు ఈ సీఎం పెట్టిన ఖర్చు వెయ్యి కోట్లే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతు తలసరి అప్పు రూ.75 వేలు..ఇప్పుడు రూ.2.50 లక్షలు ఉంది. ఇలా అయితే రైతులు ఏం వ్యవసాయం చేస్తారు.?

ఆర్ బికెలకు ఎక్కడ చూసినా తాళాలే!

నేను పాదయాత్ర దారిలో 26 రైతు భరోసా కేంద్రాలు చూశా…ఎక్కడ చూసినా తాళాలు వేసి ఉంటున్నాయి. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రం ఇచ్చే వాటితో కలిపి ఒక్కో రైతుకి రైతు భరోసా కింద 18,500 రావాలి. కానీ రూ.13,500 మాత్రమే ఇస్తున్నాడు. ఒక్కొక రైతుకు జగన్ రూ.25 వేలు బాకీ పడ్డాడు. రూ.50 వేలకు లోపు ఉన్నవాళ్లకు చంద్రబాబు ఒకేసారి రుణమాఫీ చేశారు. చీనీ చెట్లకు కూడా ట్యాంకర్ల ద్వారా నీరు అందించి ఆదుకున్నాం.

టమోటా మార్కెట్లలో జాక్ పాట్ విధానం రద్దుచేస్తాం

టీడీపీ వచ్చిన వంద రోజుల్లో జాక్ పాట్ విధానం రద్దు చేస్తాం. జగన్ రెడ్డి అమూల్ తెచ్చారు..కానీ అది పుంగనూరులో ఉండదు. తక్కువ ధరకు పాలు కొంటున్నాడు. రూ.50 కోట్లను పాడి రైతుల నుండి దోచుకుంటున్నాడు. గతంలో గోపాలమిత్రలను ఏర్పాటు చేశాం..ఒక్క ఫోన్ కొట్టగానే వాళ్లు ఇంటికి వచ్చి సమస్య పరిష్కరించేవాళ్లు. గోపాలమిత్ర వ్యవస్థను ఈ సీఎం రద్దు చేశారు. షెడ్ల డబ్బులు మేము రాగానే వడ్డీతో సహా ఇస్తాం.

లోకష్ ఎదుట రైతుల ఆవేదన

టమోటా రైతుల దగ్గర నుండి 100 బాక్సుల్లో 20 బాక్సులు జాక్ పాట్ తీస్తున్నారు.  అరకొరగా రైతు భరోసా ఇచ్చి సబ్సిడీలన్నీ రద్దు చేశారు.  2019 వరకు వరికి ఎక‌రాకి రూ.10 వేలే పెట్టుబడి..ఇప్పుడు రూ.30 వేలు ఉంది.  యూరియా తప్ప ఆర్బీకేలో ఏమీ ఉండటం లేదు. అది ఇవ్వడానికి కూడా ఏ పార్టీ అని అడుగుతున్నారు. పశువుల దాణా, గ్రాసానికి సబ్సిడీ రద్దు చేశారు. గత ప్రభుత్వంలో తవ్విన ఇంకుడు గుంతలకు బిల్లులు మార్చుకుంటున్నారు.

రైతులతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు

వెంకట్రావు నాయుడు : ఎకరా టమోటా నాటాను. కాపు బాగా కాసింది. పెట్టుబడి, కూలీలతో కలపి మొత్తం రూ.3 లక్షల ఖర్చు అయింది. డ్రిప్పు మందు విపరీతంగా పెరిగింది. కూలీలు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. ఉపాధిహామీ అనుసంధానం చేయాలి. మీ ప్రభుత్వం వచ్చాక ప్రతిమండలానికి నాలుగైదు వరినాట్ల మిషన్లు ప్రభుత్వం తరపున అందించాలి. ఈ ప్రభుత్వం ఇచ్చే డ్రిప్ ఎవరు వల్ల డ్రిప్ రంధ్రాలు పూడిపోతున్నాయి.

రామకృష్ణ : నాకు 10 ఎకరాల పొలం ఉంది. నీటి కోసం ఇప్పటి వరకు నేను 13 బోర్లు వేశా. ఈ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడతామంటోంది. అలా అయితే నేను పొలం అమ్మి మీటర్ల బిల్లు కట్టాల్సి వస్తుంది. మీ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేసి రైతులను ఆదుకోవాలి. గత ప్రభుత్వం చెక్ డ్యాములు నిర్మించింది. కానీ ఇప్పుడు ఇసుక దొంగలు వల్ల కొన్ని కొట్టుకుపోయాయి.

నారాయణరెడ్డి, రాయలపాడు: వరి రైతుకు 2019 వరకు రూ.10 వేలు మాత్రమే ఎకరాకు ఖర్చు..ఇప్పుడు రూ.30 అవుతోంది. టమోటాకు ఎకరాకు లక్ష ఖర్చు అవుతోంది..మిగిలేది ఏమీ లేదు. మిర్చి రైతులు కూడా బాగా నష్టపోతున్నారు. వంకాయలు ఐదెకరాలు నాటాను..అందులోనూ నష్టాలు చూశా. ఆర్బీకేకు వెళ్తే పార్టీ ఏంటి అని అడుగుతున్నారు..పార్టీ చెప్పగానే అడిగినవి లేదంటున్నారు.

గిరీష్ రెడ్డి,సాకిరేవుపల్లి : నేను 2 ఎకరాలు వరి నాటాను. తెల్లవారు జామును 4 గంటలకు కరెంటు ఇస్తున్నారు. మోటారు వేసిన 2 నిమిషాలకే కరెంట్ పోతోంది. అనధికారికి కనెక్షన్లు ఉంటున్నాయని అధికారులు చెప్తున్నారు. మా పొలం పక్కనే సబ్ స్టేషన్ ఉంది. కానీ సరైన కరెంట్ రావడం లేదు. మోటార్లకు స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు.

రాఘవయ్యరెడ్డి,శెట్టివారిపల్లి: నేను 3 ఎకరాల మామిడి నాటాను. గతంలో స్పింకర్లు, డిప్పులు వచ్చాయి. ఇప్పుడు ఏమీ లేదు. ఉపాధి హామీ పథకంలో అవినీతి చేస్తున్నారు. టీడీపీ హయాంలో తవ్వని గుంతలకు మూడు సార్లు బిల్లులు మార్చుకున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేశారు. నాకు 3 విడతలు వచ్చింది..నాలుగో విడత ఈ ప్రభుత్వం నిలిపేసింది.

రమణయ్య: టమోటాలు మార్కెట్ కు 100 బాక్సులు తీసుకెళ్తే 20 బాక్సులు లెక్కలోకి రాకుండా జాక్ పాట్ తీసుకుంటున్నారు. దీనికి తోడు మళ్లీ రూ.4లు కమిషన్ తీసుకుంటున్నారు. ఎంత మందికి మొరపెట్టుకున్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

సత్యమయ్య: ఈ ప్రాంతంలో పాడి రైతులు చాలా మంది ఉన్నారు. దాణా రూ.350 ఉండేది..ఇప్పుడు రూ.1220 అయింది. గ్రాసానికి కూడా సబ్సీడీ లేదు. షెడ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆవులకు బీమా కల్పించాలి.

రెడ్డప్ప, తరికొండ: టీడీపీ ప్రభుత్వంలో ఆవుల కోసం షెడ్డు మంజూరైంది. కానీ దాని బిల్లు ఇవ్వలేదు. రెండు ఆవుల కొనుగోలుకు సబ్సీడీలు ఇచ్చారు..ఇప్పుడు అది లేదు. తవుడు రూ.30 ఉంటోంది. కానీ పాల ధర మాత్రం తక్కువగా ఉంది. పాల ధర పెంచాలి. ఎన్ని ఇంజక్షన్లు చేపించినా ఆవులు గర్భం దాల్చడం లేదు.

Also Read This Blog: “Yuvagalam at Peeleru Continues to Surpass Milestones with Latest Achievement”

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *