TDP

చంద్రగిరిలో యువనేతకు నీరాజనాలు పలికిన జనంఆప్యాయంగా పలకరిస్తూ…అక్కున చేర్చుకుంటూ…!ఉత్సాహంగా సాగిన 29వరోజు యువగళం పాదయాత్ర

చంద్రగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. 29వరోజు (సోమవారం) యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో కొనసాగింది. చంద్రగిరిలో స్థానిక ప్రజలనుంచి యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపించి జయజయధ్వానాలు చేశారు. యువతీయువకులు కేరింతలు కొడుతూ, నినాదాలు చేస్తూ యువనేతను స్వాగతించారు. సోమవారం సాయంత్రం యువనేత చంద్రగిరి చేరుకునే సమయానికి జనం యువనేత కోసం రోడ్లవెంట నిలబడి వేచిచూశారు.  శివగిరి విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం కాగా,  శివగిరి గ్రామ మహిళలు యువనేతకు హారతులు పట్టి దీవెనలు అందించారు.  శానంబట్ల గ్రామంలో వేద పండితులు యువనేత పాదయాత్ర విజయవంతం కావాలంటూ ఆశీర్వదించారు. శానంబట్ల గ్రామ ప్రజలు, కార్యకర్తలు భారీ గజమాలతో యువనేతకు ఘన స్వాగతం పలికారు. తనను చూడడానికి వచ్చిన మహిళలను యువనేత ఆప్యాయంగా పలకరించారు. శానంబట్ల గ్రామంలో కొంతమంది డాక్టర్లు సంఘీభావం తెలిపారు. కోవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా  TDP చేపట్టిన కార్యక్రమాలకు తమకు స్పూర్తిదాయకంగా నిలచాయని అన్నారు. శానంబట్ల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులను కలిసిన లోకేష్ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని చెప్పి ముందుకు సాగారు. పిచ్చినాయుడుపల్లి వద్ద ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు యువనేతకు తమ సమస్యలను వివరించారు. మార్గమధ్యంలో శానంబట్లలో చంద్రగిరి మండల దళితులు లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. తమ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారని, కనీసం శ్మశానాన్ని కూడా వదలడం లేదని వాపోయారు. తొండవాడలో మీసేవ మిత్రులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించి, పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. చంద్రగిరిలో ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్… పట్టణంలోని ఒక ఇరానీ టీ సెంట‌ర్లో టీ తాగిన లోకేష్‌, వారితో మాట్లాడి సాదకబాధలు తెలుసుకున్నారు. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ, పెద్దల ఆశీస్సులు అందుకుంటూ యువనేత పాదయాత్ర కొనసాగించారు. భ‌వ‌నాల నుంచి హాయ్ చెప్పిన యువ‌త‌కు అభివాదం చేశారు. గొంగ‌డి వేసుకుని మేక‌పిల్లని భుజాన ఎత్తుకుని చిరున‌వ్వులు చిందించారు. చిన్నారుల‌కు చాక్లెట్లు ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ ముందుకుసాగారు. ఐతేపల్లిలో యువనేతను స్వాగతిస్తూ బాణాసంచా కాల్పులతో యువకులు హోరెత్తించారు.

చంద్రగిరి బాధ్యత నాది… టిడిపిని గెలిపించండి!

చంద్రగిరి నియోజకవర్గంలో పసుపుజెండా ఎగిరి 30ఏళ్లు అయ్యింది… చరిత్ర తిరగరాయండి…నానిని భారీ మెజారిటీతో గెలిపించండి..చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేయండి. చంద్రగిరిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా. టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రగిరి లో వరి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. గాలేరు-నగరి, హంద్రీనీవా పూర్తిచేస్తాం. సాగు, తాగు నీరు ఇస్తాం. వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలను కట్టిస్తాం. నిత్యావసర ధరలు, ఇసుక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కల్పిస్తాం. మహిళలు, కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అందరూ ఏకమై చంద్రబాబును సీఎం చేయండి. నిరుద్యోగ యువత కు ప్రతి ఏడూ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేట్ రంగంలో కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. స్వయం ఉపాధి కి సహకారం అందిస్తాం.

శ్మశానాన్ని కూడా వదలకుండా భూములన్నీ ఆక్రమిస్తున్నారు!యువనేత లోకేష్ ను కలిసిన చంద్రగిరి మండల దళితులు

శానంబట్లలో యువనేత లోకేష్ ను కలిసిన చంద్రగిరి మండల దళితులు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ… మాకు చెందాల్సిన వేలకోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేశారు. చంద్రగిరి మండలంలోని శానంబట్ల, తొండవాడ గ్రామాల్లో ఎస్సీలకు చెందిన ఎసైన్డ్ భూములను జగనన్న కాలనీల పేరుతో లాక్కొన్నారు. ఎస్సీల శ్మశాన వాటికకు సంబంధించిన భూమిని సైతం వదలకుండా కబ్జాకు ప్రయత్నిస్తూ దారి లేకుండా చేస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టడమేగాక దాడులకు తెగబడుతున్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు గత ప్రభుత్వం అమలుచేసిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని రద్దుచేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, ఎటువంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి దళిత నిరుద్యోగులను మోసగించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దళితుల సమస్యలను పరిష్కరించండి.

యువనేతను కలిసిన మీసేవ మిత్రులు

చంద్రగిరి నియోజకవర్గం తొండెవాడలో నారా లోకేష్ కలిసిన మీసేవ మిత్రులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.  యువగళం పాదయాత్రకు వారు సంఘీభావం తెలిపారు. మీసేవ మిత్రులు సమస్యలను విన్నవిస్తూ… ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో నాణ్యమైన, మెరుగైన సేవలందించేందుకు మావంతు కృషిచేశాం. ఫలితంగా గత ప్రభుత్వంలో మాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. రాష్ట్రంలో మేము అందించిన సేవలను మోడల్ గా తీసుకొని తమిళనాడులో ఈ-సేవ, కర్నాటకలో బెంగుళూరు ప్లస్ పేరుతో మీసేవ విధానాన్ని అమలులోకి తెచ్చారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మీసేవలను పూర్తిగా చంపేసింది.ప్రజలను మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పుకునే విధానానికి తెరలేపుతోంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందుల పాలుకావడమేగాక వివిధ పత్రాల కోసం లంచాలు సమర్పించుకుంటే కానీ పని జరగని పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీసేవ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషిచేయండి.

చంద్రగిరి టీడీపీ ఇన్చార్జి పులివర్తి నాని:

చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కంపెనీలు, కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉంది గనుకనే ఏ పనులూ చేయలేకపోతున్నానని అన్నారు. నేడు వైసీపీ అధికారంలో ఉన్నా చెవిరెడ్డి ఏమీ చేయలేకపోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను మన ప్రభుత్వంలో తెచ్చాం…చెవిరెడ్డి ఒక్క డ్రైనేజీ కూడా తీసుకురాలేదు. చెవిరెడ్డి తమ్ముడు రఘునాథరెడ్డి ద్వారా తిరుపతి రూరల్ మండలంలో మట్టి, ఇసుక, గ్రావెల్ ను దోచుకుంటున్నారు. కొండలు, గుట్టలన్నీ చెవిరెడ్డి తవ్వేస్తున్నాడు. గ్రావెల్, ఇసుక రేట్లు పెంచి అడ్డగోలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. నిలదీసిన ప్రజలను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాడు. నా చావు వరకు మీతోనే ఉంటాను…నన్ను ఆశీర్వదించండి.

Also read this blog: Lokesh Yuvagalam Padyatra of Empowerment and Resilience

 #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *