పుంగనూరు నియోజకవర్గంలో యువనేతకు జననీరాజనం అడుగడుగునా హారతులు, బాణాసంచాతో ఘనస్వాగతం
పుంగనూరు: వైసీపీ ప్రభుత్వ అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 33వరోజు (శుక్రవారం) పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కొమ్మురెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రకు నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లవెంట నిలబడి చేతులు ఊపుతూ యువనేతను స్వాగతించారు. పెద్దఎత్తున పూలవర్షం కురిపిస్తూ బాణా సంచా కాలుస్తూ యువకులు కేరింతలు కొట్టారు. కొమ్మురెడ్డిపల్లిలో పాదయాత్ర ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా అర్జునుడు అందించిన సేవలను కొనియాడారు. అనంతరం క్యాంప్ సైట్ వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. ప్రతివారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్న సమయంలో లోకేష్ ని పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సర్ప్రైజ్ చేశారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి క్యూ లో నిలబడ్డారు. లోకేష్ దగ్గర కు వెళ్లి సెల్ఫీ కావాలని సీనియర్ నాయకులు అడగడంలో యువనేత చిరునవ్వులు చిందించారు. ప్రజా సమస్యల పోరాటం కోసం గట్టిగా పోరాడుతున్నారంటూ యువనేతను అభినందించారు. కొమ్మురెడ్డివారిపల్లి వద్ద క్యాంప్ సైట్ వద్ద మహిళలు యువనేతకు ఎదురేగి పూర్ణకలశాలతో స్వాగతం పలకగా, గ్రామ మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. పోశంవారిపల్లి వద్ద మహిళలు రోడ్లవెంట నిలబడి ఘనస్వాగతం పలికారు. కొత్తపేటలో భారీ గజమాలతో యువనేతకు స్వాగతించారు. కొత్తపేటలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారివెంట 3వేల కొబ్బరికాయలు కొట్టి యువనేతకు ఘనస్వాగతం పలికారు. కొత్తపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో యువనేత కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ స్పూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. బలిజపల్లి గ్రామం వద్ద భోజన విరామం అనంతరం మంగళంపేటలో యువనేతకు గ్రామస్థులు మేళతాళాలతో స్వాగతం పలికారు. పులిచర్ల గ్రామశివార్లలో చెట్టునీడను కొబ్బరిబోండాలు అమ్ముకుంటున్న ఓ వ్యాపారిని ఆప్యాయంగా పలకరించారు. పులిచర్ల గ్రామంలో మైనారిటీ పెద్దలు, గ్రామస్తులు యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. పులిచర్ల సెంటర్ లో యువనేత గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. పులిచర్ల పాఠశాల విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. బాలికల హాస్టల్ విద్యార్థినులను పలకరించి సదుపాయాలపై ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. కొక్కువారిపల్లి విడిది కేంద్రానికి చేరుకునే ముందుకు పోలీసులు ఎగురవేస్తున్న డ్రోన్ ను చూసిన యువనేత పిడికిలి బిగించి ఇది యువగళం అని వ్యాఖ్యానించారు.
టిడిపి కార్యకర్తలను వేధిస్తే తాటతీస్తా!
ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని 43వేల మెజారిటీతో గెలిపించారు. మీ సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. పాడి, మామిడిరైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. పుంగనూరులో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి పాపాలే. ప్రశ్నించిన టిడిపి నేతలపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు.నాపై అక్రమంగా 20కేసులు బనాయించారు. అయినా భయపడకుండా పోరాటం చేస్తున్నా. పుంగనూరులో టిడిపి జెండాను ఎగురువేయండి. నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారినైనా వదిలే ప్రసక్తిలేదు. వాళ్ల తాటా తీస్తా.
మహిళల భద్రతకి దిక్కులేని దిశ ఇందుకా?
పాదయాత్ర దారిలో దిశా వాహనాన్ని చూసిన లోకేష్ ఆ వాహనం ఎదుట సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. ఇంటి దగ్గరే అంధురాలైన దళిత యువతిని గంజాయి మత్తులో ఒకడు దారుణంగా నరికేస్తే అప్పుడు దిశ పోలీసులూ, దిశ వాహనం రాలేదు. దిశ చట్టం లేకపోయినా రంగులు వేసి, పేర్లు పెట్టిన దిశ వాహనాలలో పోలీసులు ఇదిగో ఇలా నా దగ్గర మైకు లాక్కోవడానికి నా వెంట తిరుగుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం కొత్తపేట దగ్గర నన్ను ఫాలో అవుతున్న దిశ వాహనం ఇది అంటూ యువనేత ముందుకు సాగారు.
నాలుగేళ్లలో పాపాల పెద్దిరెడ్డి దోచింది రూ.10వేల కోట్లు! నేను టెర్రరిస్టును కాదు… వారియర్ ని… బెదిరింపులకు భయపడను 2024లో బాబు ప్రమాణస్వీకారం…. 2025లో జాబ్ క్యాలండర్! వైసిపి ప్రభుత్వంలో వేధింపులకు గురైన వారిని ప్రత్యేకంగా గుర్తిస్తాం! నిన్న చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ సమయంలోనే చంద్రగిరిలో గంజాయి
పుంగనూరు: గత నాలుగేళ్లలో పెద్దిరెడ్డి దోచుకున్న పాపపు సొమ్ము విలువ రూ.10వేలకోట్లు… అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి చేసిన పాపాలన్నీ బయటకు తీస్తాం… దోచుకున్న మొత్తాన్ని రాబట్టి పుంగనూరు ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చుచేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం కొత్తపేటలో జరిగిన బహిరంగసభలో యువనేత మాట్లాడుతూ… పుంగనూరు TDP కార్యకర్తలను పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు అడుగడుగునా ఇబ్బందిపెడుతున్నారు. వారందరి పేర్లు నేను రాసుకుంటున్నా. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు..చివరకు పెద్దిరెడ్డిని కూడా వదిలిపెట్టం. మీ ఉత్సాహం…ఉత్తేజం చూస్తుంటే 2024లో పుంగనూరు నియోజకవర్గంలో పసుపుజెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది.
యువగళాన్ని చూసి ప్యాలెస్ లో టివీలు బద్దలు!
యువగళం ప్రారంభమై 33రోజులే అయ్యింది…దీన్ని చూసి తాడేపల్లి పిల్లి ఇంట్లో టీవీలు పగులకొడుతున్నాడు. నేను టెర్రరిస్టును కాదు..వారియర్ ని. గతంలో ఊరూరా తిరుగుతా నిరుద్యోగులకు 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేరిస్తే నా మైక్ వెహికల్ నీకు ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేశారు..ఇప్పటికైనా ఇస్తే నా మైక్ ఇస్తా. ప్రతియేటా 6500 పోలీసు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చి మాట తప్పావ్…అవి అమలు చేస్తే నా సౌండ్ వెహికల్ నీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా. ప్రతియేటా మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు…దాన్ని అమలు చేస్తే నా మైక్ ఇస్తా. 45సంవత్సరాలు నిండిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మాట తప్పాడు. సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు. ఇవన్నీ అమలుచేస్తే జగన్ రెడ్డికి నా మైక్ ఇచ్చేస్తా. నిత్యావసరాల ధరలు పెరుగుదలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…ధరలు తగ్గిస్తే నా మైక్ ఇస్తా. సీపీఎస్ రద్దు చేస్తే నా స్టూల్ కూడా ఇచ్చేస్తా.
2025లో జాబ్ నోటిఫికేషన్
2024మే నెలలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. 2025జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యతను లోకేష్ తీసుకుంటాడని హామీ ఇస్తున్నా. పోలీసులకు కూడా అనేక సమస్యలున్నాయి. వాటిని మేం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తాం. కొంత మంది పోలీసులు వైసీపీ నాయకులు మాట విని మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేస్తాం..వాళ్లని సర్వీస్ నుండి తొలగించే బాధ్యతను నేను తీసుకుంటా.
చంద్రగిరి స్కూలులో గంజాయి… సమాధానం చెప్పండి ఎస్పీ?
చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి గంజాయిని అరికట్టేశామని వీరోచితంగా చెబుతున్నపుడే చంద్రగిరి పాఠశాలలో చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది. ఏం సమాధానం చెబుతావ్ మిస్టర్ ఎస్పీ?. మహిళలు, యువతులను కూడా గంజాయికి వైసీపీ నాయకులు బానిసలుగా చేస్తున్నారు. ప్రధాని, నార్కోటిక్ బ్యూరో అధికారులకు ఏపీలో పరిస్థితులపై లేఖ రాశాను. త్వరలోనే చర్యలు తీసుకుంటారు.
రాయలసీమకు పట్టిన శని వైసీపీ
ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా వైసీపీ పూర్తిచేయలేదు. అప్పర్ తుంగభద్ర పై కర్నాటకలో ప్రాజెక్టు కడుతున్నారు. అది పూర్తయితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు విప్పలేదు. ఏపీలో ఉన్న పరిస్థితులను చూసి గతంలో మనం తెచ్చిన కంపెనీల్నీ రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయి. కొత్త కంపెనీలు పెట్టబడులు పెట్టడానికి రావడం లేదు. మేం తెచ్చిన ఫాక్స్ కాన్ కంపెనీ నిన్న తెలంగాణాకు వెళ్లిపోయింది. లక్షమందికి ఉద్యోగాలిచ్చే పరిశ్రమ తరలిపోయింది.
వైసిపి పాలనలో మైనారిటీలపై వేధింపులు
వైసీపీ పాలనలో పుంగనూరులో మైనారిటీలపై 12మందిపై కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీలను హత్యచేశారు. అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బా, ఇబ్రహీం లను వైసీపీ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా అన్నింటినీ జగన్ రెడ్డి రద్దు చేశాడు. బీసీల రిజర్వేషన్లను జగన్ రెడ్డి తగ్గించాడు, ఆదరణ పథకాన్ని రద్దు చేశాడు. మీకు అండగా నిలబడింది ఏ ప్రభుత్వం…మోసం చేసింది ఏ ప్రభుత్వం అనే విషయాన్ని బీసీలంతా ఆలోచించాలి.
ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.1000 కోట్లు
పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి ఇసుక అక్రమంగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇసుకపైన పెద్దిరెడ్డి 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు సుదీర్ రెడ్డి పల్ప్ కంపెనీ కోసం మామిడి రైతులు పంట తమకే అమ్మాలని బెదిరిస్తున్నారు. బయటివారికి మామిడి పంటను అమ్మకుండా పెద్దిరెడ్డి అడ్డుపడుతున్నాడు…బెదిరించి లాక్కున్నాడు. మామిడి రైతుల నుంచి మూడేళ్ల కాలంలో పెద్దిరెడ్డి సంస్థ 100 కోట్ల రూపాయల దోచుకుంది. కల్లూరులో 5ఎకరాల భూములను దేవుడి భూమిని పెద్దిరెడ్డి మనుషులు దోచేశారు. అడ్డుపడినందుకు ఈఓను బదిలీ చేశారు.
పెద్దిరెడ్డికి భయపడి పొలాలకు రైతుల కాపలా!
వెంకటరెడ్డి యాదవ్, నాగభూషణం, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులు పుంగనూరు నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నారు. వారికి భయపడి రైతులు రాత్రివేళ టార్చి లైట్లు వేసుకుని తమ భూములకు కాపలా కాసుకుంటున్నారు. 300ఎకరాల ఫారెస్ట్ భూమిని కూడా పెద్దిరెడ్డి దోచేశాడు… ఈ భూమి విలువ రూ.500 కోట్లు. పుంగనూరు నియోజకవర్గంలో ఎవరు క్వారీ నిర్వహించుకోవాలన్న మంత్రి పెద్దిరెడ్డికి 50 శాతం కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. ఈ కమీషన్ల రూపేణా పెద్దిరెడ్డి నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలు సంపాదించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు దోచుకున్నారు. పాడి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందించే బాద్యతను మేం తీసుకుంటాం.
మదనపల్లి కేంద్రంగా ప్రత్యేక జిల్లా
టిడిపి అధికారంలోకి వచ్చాక పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. నెట్టిగుంటపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న రిజర్వాయర్ కోసం 100మంది రైతుల భూములు లాక్కున్నారు. చీనీ చెట్లను కూడా కొట్టేశారు. భూములు కోల్పోయిన వారందరికీ మేం అధికారంలోకి వచ్చాక పరిహారం చెల్లిస్తాం. పుంగనూరులో రోడ్లు, తాగునీటి సదుపాయాలు మేం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఏనాడూ నన్ను ఏమీ అడగలేదు. అయినా నేను ఈ పుంగనూరుకు రూ.100కోట్లు కేటాయించాను. వాటికి కూడా పెద్దిరెడ్డి అడ్డుపడ్డాడు. పుంగనూరులో తెలుగుదేశం జెండా ఎగరేయండి…మీకు అభివృద్ధి అంటే ఏంటో మేం చూపిస్తాం. గత 30ఏళ్లలో పెద్దిరెడ్డి వల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? ఈ నియోజకవర్గానికి పెద్దిరెడ్డి చేసింది సున్నా. 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించి..చల్లా బాబుకు మీరు అండగా నిలబడడండి. మీ జీవితాల్లో మార్పులు రావాలంటే అది పసుపుజెండాతోనే సాధ్యం..పసుపు జెండాను ఎగరేయండి…ఇక్కడి పాపాలను మేం అరికడతాం.
భయం మా బయోడాటాలో లేదు
భయం మా బయోడేటాలో లేదు పెద్దిరెడ్డీ….నువ్వు ఏం చేస్తావో చేస్కో…ఈ లోకేష్ తగ్గే ప్రసక్తే లేదు. కార్యకర్తలెవరూ కేసులకు భయపడొద్దు…నాపైనా 20కేసులున్నాయి. అయినా నేను ఏమీ భయపడేది లేదు….అన్నీ తప్పుడు కేసులే. నేను పాదయాత్ర చేస్తున్నా..కానీ పరదాలు కట్టడం లేదు. వైసిపి పాలనలో వేధింపులకు గురై కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు, నాయకులకు అధికారంలోకి వచ్చాక గుర్తించి గౌరవిస్తాం. నా పాదయాత్రలో ప్రతి 33కిలోమీటర్లకు ఒక కేసు పెడుతున్నారు…అయినా సరే తగ్గేదే లే. మై డియర్ జగన్ సహకరిస్తే నాది పాదయాత్ర…అడ్డుకుంటే దండయాత్రే. పుంగనూరు పెద్దిరెడ్డిని…తాడేపల్లి పిల్లిని శాశ్వతంగా ఇంటికే పరిమితం చేయండి.
ప్రపంచంలో ఏడా దొరకని సరుకు మన ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుద్ది! వ్యాన్ చూసి లోకేష్ సెటైర్లు
పుంగనూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర దారిలో మద్యాన్ని తీసుకెళ్తున్న ఓ వ్యాన్ వద్ద నిలబడి యువనేత సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏడా దొరకని సరుకు మన ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుద్ది. అవి ఇవే. పాదయాత్రలో వెళుతుంటే కంటికి కానొచ్చాయి. పాపాల పెద్దిరెడ్డి ఇలాఖా పుంగనూరులోనే బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, మలబార్ హౌస్, మెలిస్సా.. ఇవన్నీ సారుగారి సరుకే. ప్రభుత్వ దుకాణాల పేరుతో నడిచే జె సిండికేట్ షాపులకి జె బ్రాండ్స్ తీసుకెళ్తుంటే సెల్ఫీ కొట్టిన అంటూ సెటైర్లు వేశారు.
యువనేతను కలిసిన ఎస్సీ, ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారుల సంఘం
పాదయాత్ర దారిలో పులిచర్ల వద్ద ఎస్సీ, ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారుల సంఘం ప్రతినిధులు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. టిడిపి హయాంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఎన్ఎస్ ఎఫ్ డిసి ద్వారా ఇన్నోవా కార్లను సబ్సిడీపై తీసుకున్నాం. అప్పటినుంచి వాటిపై ఆధారపడి జీవిస్తున్నాం. ట్రావెల్స్ రంగంలో పోటీపెరగడంతో మా కార్లకు ఆశించినంతగా వ్యాపారం లేదు. వైట్ బోర్డు కలిగిన వాహానాలు ఎటువంటి పర్మిట్లు లేకుండానే కిరాయికి తిప్పుతుండటంతో మా వాహనాలకు గిరాకీ లేకుండా పోయింది. దీనివల్ల మాకు ఇబ్బంది ఏర్పడుతోంది. పర్మిట్లు, ట్యాక్సులు క్రమం తప్పకుండా చెల్లించడం భారంగా మారింది. కార్పొరేషన్ అధికారుల వత్తిడి భరించలేక, ఈఎంఐ కట్టలేకపోతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. టిడిపి అధికారంలోకి వచ్చాక 3నెలలకు ఒకసారి కడుతున్న ట్యాక్స్ ను రద్దుచేయాలి. సౌత్ జోన్ పర్మిట్ ను కల్పించాలి. వైట్ బోర్డు టాక్సీలను అరికట్టాలి. కరోనా సమయంలో రెండేళ్లు ఎటువంటి వ్యాపారం లేదు. అప్పటినుంచి ఈఎంఐలు కట్టాలని కార్పొరేషన్ అధికారులు వత్తిడి తెస్తున్నారు. ఇన్నోవా కార్లపై ఉన్న బకాయిలను రద్దుచేసి ఆదుకోవాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందాలనే ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వ హయాంలో ఇన్నోవా కార్లను సబ్సిడీపై అందజేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని రద్దుచేయడమేగాక లబ్ధిదారులను ఏదోవిధంగా ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో వివిధ విభాగాలకు అవసరమైన వాహనాలను ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచే అద్దెకు పెట్టేలా చర్యలు తీసుకుంటాం. రవాణాశాఖ నుంచి ఎటువంటి వేధింపులు లేకుండా చూస్తాం. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంది. తిరిగి చంద్రన్నను గెలిపించేందుకు మీ వంతు సహకారం అందించండి.
Also, read this blog: Scaling New Heights of Excellence in Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh