పాదయాత్రను అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువనేత Nara Lokesh పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రాజీవ్ నగర్ టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులనుద్దేశించి లోకేష్ మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర దారి పొడవునా వందలాది పోలీసు బలగాలను మొహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసుల నిర్బంధాన్ని అధిగమిస్తూ ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యువనేత పాదయాత్ర ముందుకు సాగింది.
యువనేత పాదయాత్రలో వ్యక్తమైన వివిధవర్గాల అభిప్రాయాలు:
నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికూడు ఆశించవద్దని ఎమ్మెల్యే అన్నాడు -షేక్. మీర్జాబి, రాజీవ్ నగర్ కాలనీ, శ్రీకాళహస్తి
టిడిపి ప్రభుత్వంలో నాకు పెన్షన్, టిడ్కో ఇల్లు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు రెండూ ఇవ్వడం లేదు. మా కాలనీకి వచ్చినప్పుడు ఇంటి గురించి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని అడిగితే నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికూడు ఆశించొద్దు అన్నారు. ఉండటానికి ఇల్లు లేక మామిడి తోట వద్ద నెలకు రూ.3 వేలకు కాపలాగా ఉంటున్నాం. ఎనిమిది నెలల క్రితం నా భర్తకు బీడీ కార్మికుల కింద ఇచ్చే పెన్షన్ తొలగించారు. కనీసం నాకైనా ఇవ్వండని అడిగితే నీ మొగుడు చచ్చినట్లు సర్టిఫికెట్ తెచ్చుకోమని ఎమ్మెల్యే అన్నాడు.(శ్రీకాళహస్తి నియోజకవర్గం, రాజీవ్ నగర్ కాలనీ వద్ద లోకేష్ తో చెప్పారు)
కారు లేకపోయినా..ఉందని రేషన్ పీకేశారు – రేణుక, శ్రీకాళహస్తి.
నా కొడుకు పేరు మీదున్న కారు ఎప్పుడో రెండేళ్ల క్రితం అమ్మేశాం. అయినా కారు ఉన్నట్లుగా చూపిస్తోందని రేషన్ తీసేశారు. మా కార్డు, మా కొడుకు కార్డు రెండూ తొలగించారు. ఇద్దరిదీ ఎలా తొలగిస్తారు..? మా వీధిలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. లైట్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు. చీకటైతే మా కాలనీ అడవిని తలపిస్తోంది.
పనులు చేసుకోవడానికి ఇసుక దొరకడం లేదు – తాపీమేస్త్రి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి
భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకోవాలంటే ఇసుక ఉండటం లేదు. ఇసుక ధరలు పెరగడం వల్ల నిర్మాణాలు పెద్దగా జరగడం లేదు. దీంతో పని లేకుండా పోతుంది. ఇసుక ధరలో అందుబాటులో ఉండేలా చేయాలి. పక్క రాష్ట్రాలకు తరలించే ఇసుక ఇక్కడి వాసులకు అందిస్తే మాకు పని దొరుకుతుంది కదా.? (విఎంసి సర్కిల్లో లోకేష్ కు వినతి పత్రం ఇచ్చారు)
బొజ్జల ఎమ్మెల్యేగా ఉన్నపుడే శ్రీకాళహస్తి అభివృద్ధి
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతి రహిత పరిపాలన జరిగింది. ఐఐటీ, ఐజర్, ఈఎంసీ1, ఈఎంసీ2 ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 3,552 టిడ్కో ఇళ్లు కట్టిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి…ఇతను కట్టిన ఇళ్లను వైసీపీ ఇవ్వడం లేదు. వాటిలో కిటికీలు, తలుపులను దొంగలు దోచుకుంటున్నారు. గజినీ, బడాచోర్ పని అయిపోయింది…రానున్న కాలంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆలయాల్లో జరిగే దందాలకు చెక్ పెడతాం. స్వర్ణముఖి నది దగ్గర వాటర్ ప్లాంట్ నెలకొల్పుతాం. శ్రీకాళహస్తి ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. రోడ్లు, డ్రైన్లు, ఇతర పనులను యుద్ధప్రాతిపదిన పూర్తిచేస్తాం. సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. పోలీసు కేసులకు ఏ కార్యకర్త భయపడవద్దు…భయం మన బయోడేటాలో లేదు. సైకో పాలనలో నేనూ బాధితుడినే…చివరకు పోలీసులు కూడా బాధితులే అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయిస్తా, అవినీతి అధికారుల తాట తీస్తా. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించండి…మీకు నేను అండగా ఉంటా.
యువనేతను కలసిన ఆటో డ్రైవర్లు
శ్రీకాళహస్తిలో పాదయాత్ర దారిలో యువనేతను ఆటో కార్మికులు కలిశారు. పట్టణంలో తమకు ఆటో స్టాండ్ లేదు, పోలీసులు అకారణంగా ఫైన్లతో వేధిస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు, పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు భారంగా మారాయి. అద్దె ఆటోలతో జీవనం సాగిస్తున్నాం. బతుకుబండి లాగడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
లోకేష్ స్పందన:
టిడిపి అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఆటోస్టాండ్లు అభివృద్ధి చేస్తాం. పోలీసుల వేధింపులు లేకుండా చూస్తాం, ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషిచేస్తాం.
యువనేతను కలిసిన భవన నిర్మాణ కార్మికులు
పాదయాత్ర దారిలో యువనేతను భవన నిర్మాణ కార్మికులు కలిశారు. ఇసుక అందుబాటులో లేక జీవనోపాథి లేకుండా పోయింది. సిమెంటు, ఇనుమురేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రమాదభీమా అందడం లేదు. సొంత ఇళ్లు లేవు. మాకు పక్కా ఇళ్లు ఇప్పించండి.
లోకేష్ స్పందన:
TDP హయాంలో ఉచిత ఇసుక పాలసీని అమలుచేశాం. గతంలో కేవలం రూ.1500కు ఇంటికి చేరే ఇసుక, ఇప్పుడు రూ. 5వేలు అయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఇసుక పాలసీ తెస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని వారి సంక్షేమానికే వినియోగిస్తాం, అందరికీ పనులు లభించేలా చూస్తాం.
Also Read:Reviving the State: Yuvagalam Padayatra and TDP’s Vision for a Poverty-Free Future
Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam